గోవా లో ప్రపోజ్ చేసిన నిఖిల్

Nikhil has completed his engagement with Dr. Pallavi Varma
Nikhil has completed his engagement with Dr. Pallavi Varma

(Nikhil has completed his engagement with Dr. Pallavi Varma and the marriage is going to be held on 16th April 2020) ‘అర్జున్‌ సురవరం’తో విజయం అందుకున్న హీరో నిఖిల్‌ త్వరలో పెళ్లి కొడుకు కానున్నాడు. అవును.. మీరు చదివింది నిజమే. ఎలాంటి చడీచప్పుడు లేకుండా, ముందస్తు ప్రకటన చేయకుండా ఎంగేజ్ మెంట్ పూర్తిచేసుకున్నాడు నిఖిల్. తన కాబోయే భార్యతో దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు. ఇప్పుడు మేటర్ లోకి వెళ్దాం..

కొన్నాళ్లుగా నిఖిల్ ప్రేమలో ఉన్నాడనే పుకార్లు ఉన్నాయి. ఓ తెలుగమ్మాయితో అతడు డేటింగ్ చేస్తున్నాడనే ఊహాగానాలు ఏడాదిగా నలుగుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఆ రూమర్లు నిజమయ్యాయి. నిఖిల్ ఆ అమ్మాయితోనే పెళ్లికి సిద్ధమౌతున్నాడు. అమ్మాయి పేరు పల్లవి వర్మ. స్వస్థలం భీమవరం. వృత్తి వైద్యురాలు. ఎక్కడైతే తన ప్రేమను వ్యక్తం చేశాడో అక్కడే అంటే గోవాలోనే నిఖిల్‌ నిశ్చితార్థం చేసుకున్నాడు. డాక్టర్‌ పల్లవి వర్మని ప్రేమించిన నిఖిల్‌ అందరి సమ్మతితో ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు. గోవాలో శనివారం పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నాడు. ఏప్రిల్‌ 16న వివాహం చేసుకోబోతున్నాడు.