Nikhil Siddharth Arjun Suravaram Telugu movie stunning Box office collections
Nikhil Siddharth Arjun Suravaram Telugu movie stunning Box office collections

నిఖిల్ హీరోగా నటించిన సినిమా అర్జున్ సురవరం..! మొదటి షోతోనే హిట్ టాక్ అందుకున్న సినిమా. ‘అర్జున్ సురవరం’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజులుగా పోస్ట్ పోన్ అవుతూ.. అవుతూ వచ్చిన ఈ సినిమా మొదటి షో నుండే హిట్ టాక్ అందుకుంది. ముఖ్యంగా తొలిరోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4.1 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం. ఈ సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. రెండు రోజుల్లో 8.05 కోట్లు కలెక్ట్ చేసిందంటూ నిఖిల్ ట్వీట్ చేశారు. మరిన్ని స్క్రీన్లు యాడ్ అయ్యాయని నిఖిల్ చెప్పుకొచ్చాడు.

ఇక రెండో వారం కూడా సినిమాకు పోటీగా పెద్ద సినిమాలు లేకపోవడం పెద్ద ప్లస్ గా నిలిచింది. ముఖ్యంగా ఈ వారం విడుదలైన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమమవ్వడంతో సినిమా చూడాలని అనుకునే వాళ్ళు అర్జున్ సురవరంకు సమయాన్ని కేటాయిస్తున్నారు. దీంతో ఈ వీకెండ్స్ లో కూడా అర్జున్ సురవరంకు మంచి కలెక్షన్లు దక్కుతున్నాయి. ఇప్పటికే మొత్తం రికవరీ చేసిన అర్జున్ సురవరం సినిమా వచ్చే వారం వెంకీమామ విడుదల అయ్యే వరకూ మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా విడుదల కొంచం ఆలస్యం అయినా కలెక్షన్ల పరంగా సినిమా లాభాల బాట పట్టింది. విడుదలకు ముందు ఈ సినిమా హక్కులు 8.2 కోట్లకు అమ్ముడయ్యాయి. అర్జున్ సురవరం చిత్రం ఇన్వెస్టిగేటింగ్ థ్రిల్లర్ గా సాగుతుంది. తమిళంలో విజయం సాధించిన కణితన్ కు రీమేక్ గా చేసిన ఈ సినిమా తెలుగులో అంతకు మించిన రెస్పాన్స్ అందుకుంది.

ఒరిజినల్ తో పోలిస్తే రీమేక్ లో చాలా మార్పులు కనపడ్డాయి. ముఖ్యంగా ఎక్కడా బోర్ అన్నది కొట్టనివ్వకుండా సినిమాను ముందుకు నడిపిన తీరు అద్భుతం. తెలుగు వెర్షన్‌లో చాలా మార్పులు చేసాడు ఈ సినిమా డైరెక్టర్ సంతోష్. హిట్ కథకి మార్పులు చేర్పులు చెయ్యడం వల్ల సినిమాలో సోల్ నిలబడింది. ‘అర్జున్ సురవరం’తో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు నిఖిల్. ఇప్పుడు మరో సినిమా ఇతడు హీరోగా సుకుమార్ – గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఒక సినిమాను నిర్మించనున్నారు. అంతేకాకుండా కార్తికేయ-2 కూడా షూటింగ్ దశలో ఉంది. దీంతో నిఖిల్ మార్కెట్ ను అర్జున్ సురవరం అమాంతం పెంచేయడమే కాకుండా.. ఎన్నో విషయాల్లో నిఖిల్ కు సినిమా హెల్ప్ అయింది.