భార్యపై నిఖిల్ ఎమోషనల్ పోస్ట్..!

Nikhil Siddharth Special Birthday Wishes To His Wife Pallavi Varma-min

లాక్‌డౌన్ సమయంలోనే తన ప్రేమకు ప్రమోషన్ దక్కించుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ (Nikhil). మే 14వ తేదీన తన బంధు మిత్రుల సమక్షంలో పురోహితులు నిర్ణయించిన ముహూర్తం ఉదయం 06 గంటల 31 నిమిషాలకు అగ్ని సాక్షిగా తన ప్రేయసి పల్లవి వర్మ(Pallavi Varma) మెడలో మూడుముళ్ళేసి ఏడడుగులు నడిచాడు. ఇక గత మూడు నెలలుగా ఆమెతో జాలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నిఖిల్ తాజాగా పల్లవిని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్, షేర్ చేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ హీరో భార్య ప‌ల్ల‌వి వ‌ర్మ బ‌ర్త్‌డే సందర్బంగా ఆమెతో దిగిన ఫోటో షేర్ చేస్తూ ఎమోష‌న‌ల్ కామెంట్ పెట్టాడు. ‘నా ప్రియ‌మైన భార్య‌కు హ్యాపీ బ‌ర్త్ డే. నువ్వు నా జీవితంలో ఎప్పుడైతే వ‌చ్చావో అప్ప‌టి నుండి నా లైఫ్ అంతా ఆనంద‌మ‌యంగా మారింది’ అంటూ ట్వీట్ నిఖిల్ చేశాడు. పల్లవి తనతో ఎంతో అణకువగా మెదులుతోందని, ఆమె వచ్చాక జీవితం మరింత హాయిగా మారిందని పేర్కొన్నాడు.

nikhil siddharth comments on pallavi varma with special tweet

‘అర్జున్ సురవరం’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో వరుస ప్రాజెక్ట్‌లతో బిజీ కానున్నాడు. కార్తికేయ 2తో పాటు 18 పేజెస్ సినిమాలతో మరోసారి ప్రేక్షకులను ముందుకు రాబోతున్నాడు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *