SPY Review in Telugu: కార్తికేయ 2 మూవీ లో వచ్చిన ఫేమ్ తర్వాత నిఖిల్ సిద్దార్థ్ పాన్ ఇండియన్ స్టార్ గా గుర్తింపు పొందారు. అయితే ఈ రోజు విడుదలైన స్పై చిత్రంతో అతను ప్రేక్షకులకు తిరిగి మరో భారీ వరల్డ్ వైడ్ మూవీ తో వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అన్నది తెలుసుకుందాం.
SPY Telugu Review & Rating: 2.75/5 – నటీనటులు: నిఖిల్, ఐశ్వర్య మేనన్, మకరంద్ దేశ్ పాండే, అభినవ్, ఆర్యన్ రాజేశ్, నితిన్ మెహ్రా, రానా – స్టోరీ: కె. రాజశేఖర్ రెడ్డి – దర్శకత్వం: గ్యారీ బీహెచ్
కథ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ అనుమానాస్పద అదృశ్యం వెనుక రహస్యాన్ని టచ్ చేస్తూ సాగుతుంది ఈ మూవీ. రా ఏజెంట్ జైవర్ధన్ (నిఖిల్) శ్రీలంకలో వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే ఇండియా పై దాడి చేయాలి అనుకున్న ఉగ్రవాది ఖదీర్ ఖాన్ చనిపోయాడు అని అందరూ భావిస్తారు. కానీ అతని వల్ల త్రేట్ అలాగే ఉంటుంది.
కథ విషయానికి వస్తే ఈ చిత్రం స్వాతంత్ర సమరయోధుడైన నేతాజీ యొక్క కథ మీద ఆధారపడి ఉంటుంది. ఇందులో రా ఏజెంట్ అయినా నిఖిల్ తన అన్నను హత్య చేసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను పట్టుకోవడానికి సిద్ధపడతాడు. ఈ క్రమంలో అతని ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాడు? ఎలాంటి పద్మవ్యూహాలను చేదిస్తాడు అనే విషయం మిగిలిన స్టోరీ.
సినిమా పాయింట్ అఫ్ వ్యూ , నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సంబంధించినటువంటి సన్నివేశాలు అలాగే రా నాకు సంబంధించిన కొన్ని సీన్స్ సినిమాకి అట్రాక్షన్ అని చెప్పవచ్చు.

నెగటివ్స్: సినిమాలో స్క్రీన్ ప్లే చాలా లైట్ గా ఉంది. – మూవీ స్టార్టింగ్ లో మెయింటైన్ చేసిన హైప్ చివరి వరకు కంటిన్యూ అవ్వలేదు. – కొన్ని సన్నివేశాలు స్లోగా బోరింగ్ గా ఉన్నాయి. – ఇంతవరకు కూడా ఈజీగా గెస్ చేసే విధమైనటువంటి సీన్స్ తో ఉంది. – సాంగ్స్ ఆవరేజ్ గా ఉన్నాయి.
పాజిటివ్స్: నేతాజీ కి సంబంధించిన స్టోరీ అద్భుతంగా ఉంది. – నిఖిల్ మరోసారి తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. – బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలలో బాగా సెట్ అయింది. – నేతాజీ డైలాగ్స్ ఎక్స్ల్లెంట్ గా ఉన్నాయి.
చివరి మాట: మంచి ఎంటర్టైనింగ్ గా సాగే స్పై చిత్రం చూడాలి అనుకునే వారికి ఈ మూవీ కచ్చితంగా నచ్చుతుంది.