సమీక్ష : నిను వీడని నీడను నేనే

Ninu Veedani Needanu Nene Telugu Movie Review, Rating, sundeep kishan
Ninu Veedani Needanu Nene Telugu Movie Review, Rating, sundeep kishan

Ninu Veedani Needanu Nene Telugu Movie Review

విడుదల తేదీ : జూలై 12, 2019
రేటింగ్ : 2.5/5
నటీనటులు : సందీప్ కిషన్, అన్యా సింగ్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ, వెన్నెల కిషోర్.
దర్శకత్వం : కార్తీక్ రాజు
నిర్మాత‌లు : దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్
సంగీతం : ఎస్.ఎస్. తమన్
సినిమాటోగ్రఫర్ : ప్రమోద్ వర్మ
ఎడిటర్ : ప్రవీణ్

తెలుగులో ఒకటి రెండు హిట్స్ అందుకొని తరువాత తమిళ్ లో ఎంట్రీ ఇచ్చిన సందీప్ కిషన్ కి ఈ మధ్య చెప్పుకో దగ్గ సినిమా పడలేదు దానితో తానే నిర్మాతగా మారి ఒక డిఫరెంట్ సబ్జెక్టు ఎంచుకొని నిను వీడని నీడను నేనే సినిమా చేసాడు.టీజర్ అండ్ ట్రైలర్ తోనే ఓ డిఫరెంట్ ఎటెంప్ట్ లాగా కనిపించిన నిను వీడని నీడను నేను ప్రేక్షకులముందుకు వచ్చింది.మరి ఈ సినిమా ఎలా ఉంది.హీరోగా సందీప్ కిషన్ ను నిలబెట్టిందా నిర్మాతగా కూడా సందీప్ కిషన్ కి తొలి విజయం అందించిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

[INSERT_ELEMENTOR id=”3574″]

కధ:

అర్జున్, మాధవి ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకొని లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు కారు లో వెళ్తూ ఉండగా అనుకోకుండా యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ తరువాత అర్జున్ అద్దం లో చూసుకున్న ప్రతి సారి వేరొక మనిషి కనిపిస్తూ ఉంటాడు.అలాగే మాధవి కి కూడా అదే సిట్యువేషన్ ఎదురువుతుంది.ఇంతకీ అర్జున్ మాధవి లకు అద్దం లో కనిపిస్తున్న ఆ ఇద్దరు ఎవ్వరు.అసలు వీళ్లకు యాక్సిడెంట్ ఎలా జరిగింది.ఆ యాక్సిడెంట్ వెనుక మిస్టరీ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటులు:

గతంలో తన ఎనర్జీ తో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో లైటర్ వెయిట్ ఉన్న లవర్ బాయ్ పాత్రలు చేసి మెప్పించిన సందీప్ కిషన్ ఫస్ట్ టైం కాస్త సెంటిమెంట్ డోస్ ఉన్న హారర్ సబ్జెక్టు ని ఎంచుకున్నాడు. సినిమాలో చాలా భాగం వెన్నెల కిషోర్ తో పోటా పోటీ గా నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా అతని నటన ఆకట్టుకుంది.కొత్త హీరోయిన్ల అన్యా సింగ్ లుక్స్ పరంగా యావరేజ్ అనిపించినా నటన పరంగా మెప్పించింది. ఈ మధ్య అనేక సినిమాలకు సేవియర్ గా మారుతున్న వెన్నెల కిషోర్ ఈ సినిమాకి కూడా చాలా ప్లస్ అయ్యాడు. చాలా వరకు డైలాగ్స్ లేకుండా తన హవా భావాల తోటే కామెడీ పండించాడు.డాక్టర్ గా మురళి శర్మ , పోలీస్ ఆఫీసర్ గా పోసాని సినిమాకు తమ వంతు కంట్రిబ్యూషన్ అందించారు.మాళవిక నాయర్, ప్రగతి ల ప్రాజెన్సీ సినిమాకి ప్లస్ అయ్యింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

టెక్నీషియన్స్ :

ఈ సినిమా డైరెక్టర్ కార్తీక్ రాజు ఎంచుకున్న కదాంశం కాస్త రొటీన్ గా వున్నా స్క్రిన్ ప్లే మాత్రం చాలా వైవిధ్యంగా ఉంది.అలాగే ఈ కథలో సెంటి మెంట్ ని జొప్పించిన విధానం కూడా బాగుంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమాను గ్రిప్పింగ్ గా నడిపించిన కార్తీక్ రాజు సెకండ్ హాఫ్ లో మాత్రం కాస్త కన్ఫ్యూజ్ చేసాడు.అలాగే మెయిన్ పాయింట్ నుంచి డివియోట్ అయ్యాడు. మళ్ళీ క్లయిమాక్స్ లో సినిమా గాడి న పడింది. ప్రమోద్ వర్మ సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్. డైరెక్టర్ తో అతనికి కుదిరిన సింక్ వల్ల చాలా క్లిష్టమైన సన్నివేశాలు ప్రేక్షకులకు తేలికగా అర్ధమయ్యాయి. లిమిటెడ్ బడ్జెట్ తోనే సినిమాకి రిచ్ నెస్ తీసుకొని వచ్చాడు. తమన్ మ్యూజిక్ కూడా సినిమా బిగ్గెస్ట్ ఎసెట్. చాలా చోట్ల సీన్స్ లోని కంటెంట్ ని అనేక రేట్లు ఎలివేట్ చేసింది తమన్ అందించిన ఆర్.ఆర్. తమన్ ని ఆర్.ఆర్.స్పెషలిస్ట్ అని ఎందుకు అంటారొ ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది. ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంది.నిర్మాణ విలువలు సినిమాకి తగినట్లుగా ఉన్నాయి.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఫైనల్ గా:

హారర్ బ్యాక్ డ్రాప్ లో సెంటిమెంట్ మిక్స్ చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సగం వరకు ఆసక్తిగా సాగింది.రెండవ భాగం కాస్త తడబడినా కూడా రెండు భాషలలో విడుదలవడం వల్ల బాక్సాఫీస్ దగ్గర సేఫ్ వెంచర్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి

బోటమ్ లైన్: కన్ఫ్యూజ్ చేసిన దెయ్యాలు

[INSERT_ELEMENTOR id=”3574″]