Nireekshana Archana comments on Jr Ntr And Janatha Garage Movie

80ల్లో ‘నిరీక్షణ’ సహా పలు సినిమాలతో తనదైన ముద్ర వేసిన అర్చన.. సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా విభిన్నమైన, ప్రయోగాత్మక చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అర్చన. ఈమెను ‘నిరీక్షణ’ అర్చన అంటే చాలా మంది గుర్తుపడతారు. వరుసగా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఏకైక నటి ఈమె. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ ఆఖరికి ఇంగ్లిష్‌లో కూడా ఆమె నటించారు.

అయితే, సుమారు 25 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులకు దూరమైన అర్చనను ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. కమెడియన్ ఆలీ వ్యాఖ్యాతగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమంలో అర్చన పాల్గొన్నారు. సోమవారం ప్రసారమైన ఈ ఎపిసోడ్‌లో పలు ఆసక్తికర విషయాలు చెప్పారు అర్చన. ఈ సందర్భంగా ఇప్పటి తెలుగు సినిమాల గురించి అడిగితే.. మహానటి, జనతా గ్యారేజ్ గురించి ఆమె మాట్లాడింది.దీనికి అర్చన సమాధానం ఇస్తూ.. ‘మహానటి నాకు చాలా నచ్చంది. జనతా గ్యారేజ్ సినిమా కూడా చాలా నచ్చింది. ఆ రెండు సినిమాలు నాకు వేరే లెవెల్‌లో ఉన్నాయి’ అని అన్నారు. అందులో కీర్తి సురేష్ చాలా బాగా నటించిందని చెప్పిన అర్చన..

‘ఇప్పుడున్న హీరోల్లో ఇతను చాలా అద్భుతంగా చేస్తున్నాడు అనిపించిన తెలుగు హీరో ఎవరు?’ అని అడిగిన ఆలీ ప్రశ్నకు అర్చన స్పందిస్తూ.. ‘జనతా గ్యారేజ్ చూస్తున్నప్పుడు నాకు జూనియర్ ఎన్టీఆర్ గారి నటన చాలా నచ్చింది. అది చాలా కన్వెన్సింగ్ పెర్ఫార్మెన్స్. మోహన్ లాల్‌కు ఇవ్వాల్సిన స్పేస్ ఇస్తూ.. తన స్పేస్ తాను తీసుకుని తారక్ అద్భుత అభినయాన్ని ప్రదర్శించాడని.. లాల్‌ను మ్యాచ్ చేస్తూ నటించాడని అర్చన చెప్పింది. జనతా గ్యారేజ్ సినిమా కూడా తనకు వేరే లెవెల్లో అనిపించిందని ఆమె అంది. ఛాలెంజింగ్ రోల్ అంటే అదే. తెలుగు ఇంత మంచి సినిమాలు వస్తున్నాయంటే నాకు చాలా సంతోషంగా ఉంది’ అని అర్చన చెప్పుకొచ్చారు.