Nishabdham_ Makers of Anushka Shetty and R Madhavan starrer release an intriguing poster
Nishabdham_ Makers of Anushka Shetty and R Madhavan starrer release an intriguing poster

(Nishabdham: Makers of Anushka Shetty and R Madhavan starrer release an intriguing poster) పండుగలని, ప్రత్యేక రోజులను పురస్కరించుకుని సినిమాలకి సంబంధించిన కొత్త ప్రచార చిత్రాలను యూనిట్స్‌ విడుదల చేస్తూ సినీ అభిమానులను ఖుషీ చేస్తుంటాయి. ‘అరుంధతి’, ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’, ‘సైజ్ జీరో’, ‘భాగమతి’ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసిన అనుష్క ప్రస్తుతం ‘నిశ్శబ్ధం’ అనే చిత్రంలో నటిస్తోంది. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

అనుష్క, ఆర్‌.మాధవన్‌, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు ప్రధాన పాత్రధారులుగా ‘నిశ్శబ్దం’ చిత్రం రూపొందుతుంది.అమెరికాలో ఎక్కువ భాగం చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, ఇంగ్లీష్, హిందీ, మలయాళ భాషల్లో భారీస్థాయిలో విడుదల కానుంది. సంక్రాంతి కానుకగా సినిమా పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. పోస్టర్‌ లుక్ అదిరిపోయేలా డిజైన్ చేశారు. మాధవన్‌ కోపంగా చూస్తుంటే భయపడుతున్నట్లు ఉండే అనుష్క లుక్ అందరిని ఆకట్టుకుంది.సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతుంది.

ఇందులో అనుష్క మూగ అమ్మాయిగా, సాక్షి అనే ఆర్టిస్టుగా నటిస్తుంది. మాధవన్‌ సెలబ్రిటీ మ్యూజీషియన్‌గా, అంజలి ఇంటలిజెన్స్‌ అధికారిగా, షాలినీ అనుష్కకి సహాయకురాలిగా నటిస్తున్నారు. ‘భాగమతి’ తర్వాత దాదాపు రెండేండ్ల గ్యాప్‌తో అనుష్క నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈచిత్రంలో దక్షిణాది తారాగణంతోపాటు హిందీ, ఇంగ్లీష్‌ నటులు కూడా నటిస్తుండటం విశేషం.