టాలీవుడ్ హీరో నితిన్ కథానాయకుడిగా మెర్లపాకా గాంధీ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ ఆదివారం నుంచి దుబాయ్‌లో షూటింగ్ జరుగుతోంది. హీరో హీరోయిన్లు నితిన్, నభా నటేష్‌పై దుబాయ్‌లో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఫిల్మ్ షూటింగ్ మొదలైన విషయాన్ని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసిన నితిన్.. సెట్స్‌లో స్వెటర్ వేసుకొని పియానో ప్లే చేస్తూ కనిపిస్తున్న ఓ ఫొటోను షేర్ చేశాడు. ఇది హిందీ మూవీ ‘అంధాదున్’కు తెలుగు రీమేక్.
ఈ మూవీలో తమన్నా భాటియా ఓ కీలక పాత్ర చేస్తున్నారు. జనవరి నుంచి జరిగే తదుపరి షెడ్యూల్ షూటింగ్లో ఆమె పాల్గొననున్నారు. నితిన్ 30 లో తమన్నా భాటియా-హెబ్బా అందాల ట్రీట్ ఓ లెవల్లోనే ఉంటుందని సమాచారం. శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ సినిమాను ఎన్. సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్నారు. ఠాగూర్ మధు దీనికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. మహతి స్వరసాగర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి హరి కె. వేదాంత్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇతర కళాకారులు సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించనున్నారు. నితిన్ నటించిన రంగ్ దే నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం నితిన్ ‘రంగ్ దే’ షూటింగ్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.