నితిన్ కి భీష్మ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్.. ఫస్ట్ వీక్ రిపోర్ట్

2305
Nithin Bheeshma first week box office collection report
Nithin Bheeshma first week box office collection report

(Nithiin Rashmika Mandanna Bheeshma First weekend box office collection report, Bheeshma WW Collection) వరుసగా 3 ఫ్లాపుల తర్వాత, సుదీర్ఘ విరామం తర్వాత ఈ హీరో చేసిన భీష్మ సినిమా సూపర్ హిట్టయింది. మొదటి రోజు హిట్ టాక్ రావడంతో శని, ఆదివారాలు ఈ సినిమాకు జనాలు పోటెత్తారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి తర్వాత మరో మంచి సినిమా లేని లోటును భీష్మ భర్తీ చేసింది. మొదటి రోజు నితిన్ కెరీర్ హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించిన ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి 78 శాతం రికవరీ సాధించేసింది.అలా సూపర్ హిట్ టాక్ తో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది భీష్మ.

మొదటి వారాంతం ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల 89 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే. నైజాంలో ఈ సినిమా 3 రోజుల్లోనే బ్రేక్-ఈవెన్ సాధించడం. అవును.. దాదాపు 6 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి నైజాంలో ఇది బ్రేక్ ఈవెన్ అయింది. ఇక ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి

నైజాం 6.01 cr
సీడెడ్ 2.10 cr
ఉత్తరాంధ్ర 1.78 cr
ఈస్ట్ 1.21 cr
వెస్ట్ 0.88 cr
కృష్ణా 0.97 cr
గుంటూరు 1.34 cr
నెల్లూరు 0.48 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.60 cr
ఓవర్సీస్ 2.35 cr
వరల్డ్ వైడ్ టోటల్ 18.72 cr

‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల బిజినెస్ జరిగింది. 3 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 18.72 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 3.98 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా సూపర్ హిట్టయింది. ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసిన భీష్మ.. రేపటికి మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరే అవకాశం ఉంది. నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా భీష్మ నిలిచే అవకాశం ఉంది.