‘భీష్మ’ 13 డేస్ కలెక్షన్స్..!

2466
Nithin Rashmika Bheeshma 13 days box office collection report
Nithin Rashmika Bheeshma 13 days box office collection report

యంగ్ హీరోహీరోయిన్లు నితిన్, రష్మిక మందన్న వసూళ్ల వేట కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి 21న భీష్మ రూపంలో వసూళ్లు ప్రారంభించిన ఈ జోడీ నేటికీ ఏ మాత్రం ఆ స్పీడు తగ్గించడం లేదు. రెండు వారాలు పూర్తవుతున్నప్పటికీ ఈ చిత్రం డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది. భీష్మ సినిమా 13 రోజు కూడా అదే హంగామా కొనసాగించింది. వర్కింగ్ డే అయినప్పటికీ వసూళ్ళలో పెద్దగా డ్రాప్స్ కనిపించలేదు.

మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు కొంతమేర డ్రాప్స్‌ని సొంతం చేసుకున్నప్పటికీ, ఈవినింగ్ అండ్ నైట్ షోలు ఆ లోటును పూడ్చేశాయి. ‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 26.98 కోట్ల షేర్ ను వసూల్ చేసింది. ఇప్పటికే ఈ చిత్రం కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాల బాట పట్టారు. మరో పక్క ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం అదరకొడుతుంది. అక్కడ ఈ చిత్రం 1 మిలియన్ డాలర్ల దిశగా అడుగులు వేస్తుంది.

నైజాం 8.75 cr
సీడెడ్ 3.19 cr
ఉత్తరాంధ్ర 2.95 cr
ఈస్ట్ 1.69 cr
వెస్ట్ 1.26 cr
కృష్ణా 1.51 cr
గుంటూరు 1.78 cr
నెల్లూరు 0.76 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.91 cr
ఓవర్సీస్ 3.18 cr
వరల్డ్ వైడ్ టోటల్ 26.98 cr

నితిన్ హీరోగా రూపొందిన భీష్మ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న నటించి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఔట్ అండ్ ఔట్ కామెడీతో వెన్నెల కిషోర్ బాగా ఆకట్టుకున్నాడు. మొత్తానికి భీష్మ మూవీ నితిన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచింది.