nithiin, Chandra Sekhar Yeleti's Next Titled Check, Koratala Siva Launches Pre Look (1)

Nithiin Check Pre Look: యువ హీరో నితిన్ ఇటీవల వచ్చిన భీష్మతో మంచి హిట్ అందుకున్నాడు. భీష్మ హిట్ తర్వాత ఆయన నుంచి రాబోతున్న చిత్రం రంగ్ దే. ఈ సినిమాను వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నాడు. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక సినిమాను ప్రారంభించిన సంగతి తెలిసిందే. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లు. ఈ సినిమాకు ‘చెక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ యేలేటి మాట్లాడుతూ ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ కథ ఇది. చదరంగం నేపథ్యంలో సాగుతుందన్నారు. ప్రియా వారియర్‌కి ఇదే తొలి తెలుగు చిత్రం. ఈ నెల 12 నుంచి నెలాఖరు వరకు సాగే షెడ్యూల్‌తో చిత్రీకరణ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇందులో నితిన్ అద్భుతంగా చేస్తున్నాడు. ఈసినిమా చిత్రీకరణ చివరి దశలో ఉంది’’ అని చెప్పారు.

Nithin Rakul Preet next movie titled Check pre look released

నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘నితిన్-చంద్రశేఖర్ యేలేటి కాంబినేషన్ లోసినిమా చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో ఎవరు ఎవరికి ఎలా చెక్ పెడతారనేది చివరి వరకూ తెలియదు. ఇంత వరకు నితిన్ ఈ తరహా పాత్ర చేయలేదు. పెర్ఫార్మెన్స్ పరంగా ఈ చిత్రంలో నితిన్ విశ్వరూపం కనిపిస్తుంది.

ఇక వీటితో పాటు నితిన్ మరో సినిమాకు కూడా ఓకే చెప్పాడు. హిందీలో సూపర్ హిటైనా అంధధూన్ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు.