నితిన్-చంద్రశేఖర్ యేలేటి చెక్ ట్విట్టర్ రివ్యూ

399
Nithiin And Rakul Preet Singh Check Movie Twitter Review And Audians Reactions

నితిన్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ ‘చెక్’ భారీ అంచనాలతో నేడు థియేటర్స్‌లో విడులైంది. చంద్రశేఖర్ ఏలేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నితిన్ ఈ సినిమాలో ఖైదీగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలకానుంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మించాడు. చదరంగం నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది.

ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌ ఆకట్టుకునే విధంగా ఉండి ఈ సినిమాపై అంచనాలు పెరిగేలా చేసారు. ప్రియా ప్రకాష్ వారియర్‌కు ఇదే తొలి తెలుగు చిత్రం. ఈ యంగ్ హీరో నితిన్‌కి వీరాభిమాని కావడంతో ప్రతి సినిమాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ సపోర్ట్ ఉండనే ఉంటుంది. ఈ సినిమాకి ట్వీట్‌లతో హీటెక్కిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.

నితిన్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నారు. ఇక ఎన్టీఆర్ కూడా నితిన్ ‘చెక్’ సినిమాకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేయడం.. రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరుకావడంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే సినిమాలో కథానుగుణంగా ఒక్క పాటకు మాత్రమే సందర్భం కుదిరిందని.. దీంతో ఒక్క పాటను మాత్రమే పెట్టాల్సి వచ్చిందని.. అంటున్నారు దర్శక నిర్మాతలు.

ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..ఈ సినిమా ఏపీ, తెలంగాణలో దాదాపు రూ. 15 కోట్ల మేరకు బిజినెస్ చేసిందని టాక్. కర్ణాటక, మిగతా దేశం, ఓవర్సీస్ మొత్తం కలిపి రూ. 1.1 కోట్ల బిజినెస్ చేసింది. మొత్తంగా రూ. 16.5 కోట్ల బిజినెస్ చేసింది. ఇక చెక్ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 16.5 కోట్లను రాబట్టాలి.

ఇంతకీ ఈ సినిమా టాక్ ట్విట్టర్‌లో ఆడియన్స్ రెస్పాన్స్ ఏంటో చూద్దాం.

చెక్ సినిమా ఫస్టాఫ్ కొన్ని ఆసక్తికరమైన సన్నివేషాలతో బాగుంది. అలాగే బోరింగ్ సీన్లు కూడా ఉన్నాయి. ప్రధాన సమస్య ఏంటంటే.. భావోద్వేగంతోనే కథకు కనెక్ట్ కావడం. ట్విట్టర్‌‌లో నెటిజన్స్ కామెంట్స్ బట్టిచూస్తే నితిన్‌కు మరో హిట్ గ్యారెంటీ అని తెలుస్తోంది. ఎక్కువ శాతం నెటిజన్స్ సినిమా గురించి పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. సో నితిన్ ఖాతాలో మరో హిట్ పడ్డట్లే.

క్లైమాక్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్.. స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది..

ఇక నితిన్ ఇతర సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే చేస్తున్నాడు. రంగ్ దేలో నితిన్ సరసన మొదటిసారి కీర్తి సురేష్ నటిస్తుంది. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. రంగ్ దే శాటిలైట్, డిజిటల్ రైట్స్‌ను జీ నెట్వర్క్ (జీ తెలుగు & జీ 5) దక్కించుకుంది. ఈ డీల్ విలువ దాదాపు 10కోట్లని సమాచారం. ఇక సినిమాతో పాటు హిందీలో సూపర్ హిటైనా అంధధూన్ రీమేక్‌లో నితిన్ నటించనున్నాడు. ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ నిర్మిస్తోండగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించనున్నాడు.