రివ్యూ: నితిన్‌ మాస్ట్రో

0
3249
Maestro movie review in Telugu
Maestro movie review in Telugu

Maestro Review: రివ్యూ: నితిన్‌ మాస్ట్రో
Maestro Rating: 3/5

ఈ యేడాది ఇప్పటికే నితిన్ (Nithiin) నటించిన ‘చెక్‌’, ‘రంగ్ దే’ చిత్రాలు విడుదలయ్యాయి. కథాపరంగా ‘చెక్‌’ భిన్నమైనదే అయినా విజయం విషయంలో నిరుత్సాహపర్చింది. ఇక లవ్ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘రంగ్ దే’ కు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. నితిన్ (Nithiin) ముచ్చటగా మూడో చిత్రం ‘మాస్ట్రో (Maestro)’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బాలీవుడ్‌లో ఘన విజయం సాధించిన ‘అంధాదున్‌’ రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కింది.

కథ :
ఇక కథలోకి వస్తే అరుణ్(నితిన్) ఒక అంధుడు కానీ పియానో ఇన్స్ట్రుమెంట్ వాయించడంలో ఎంతో ప్రావీణ్యం ఉన్నవాడు. దానితోనే తన లైఫ్ ని రన్ చేసుకుంటూ వస్తాడు. ఈ క్రమంలోనే ఓ రెస్టారెంట్‌లో అమ్మకానికి ఉన్న పియానో కొందామని వెళ్తాడు. అక్కడే ఆ రెస్టారెంట్‌ ఓనర్‌ కుమార్తె సోఫి(నభా నటేశ్‌)తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది.

Maestro movie review in Telugu
Maestro movie review in Telugu

అదే రెస్టారెంట్‌కు తరచూ వస్తుంటాడు ఒకప్పటి హీరో అయిన మోహన్‌(నరేశ్‌). అరుణ్‌లోని టాలెంట్‌ చూసి తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఇంటికి వచ్చి పియానో వాయించమని చెబుతాడు. అరుణ్‌.. మోహన్‌ ఇంటికి వెళ్లే సరికి అతడు హత్యకు గురవుతాడు.

మరి ఈ మర్డర్ ఎవరు చేసారు? ఎవరు చేయబడ్డారు? అంధుడు అయినటువంటి అరుణ్ ఈ కేసు నుంచి బయట పడతాడా అన్నవి తెలియాలి అంటే హాట్ స్టార్ లో ఈ సినిమా చూడాల్సిందే.

Maestro movie review in Telugu
Maestro movie review in Telugu

బలాలు
నితిన్‌, తమన్నా
ట్విస్ట్‌లు

బలహీనతలు
తెలుగు నేటివిటీ లేకపోవడం
ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

Maestro movie review in Telugu
Maestro movie review in Telugu

నటీనటులు:
బాలీవుడ్‌ ‘అంధాదున్‌’లో ఆయుష్మాన్‌ ఖురానా అంధుడి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు, నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నారు. అదే పాత్రను నితిన్‌ తెలుగులో చక్కగా చేశారు. అరుణ్‌ పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. ఇక ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది సిమ్రన్‌ పాత్ర పోషించిన తమన్నా గురించి. హిందీలో టబు ఈ రోల్‌ చేశారు. తెలుగులో తమన్నా కూడా చక్కగా నటించింది. రెండు భిన్న పార్శ్వాలను చూపించే ఆ పాత్రలో ఆమె ఒదిగిపోయింది.

ఇక జిషు సేన్‌ గుప్త, నభా నటేశ్‌, శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, అనన్య నాగళ్ల, హర్ష వర్దన్‌ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక నిపుణుల్లో మహతి స్వర సాగర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రధానంగా చెప్పుకోవాలి. ఎండ్ టైటిల్స్ లో వచ్చే ‘మాస్ట్రో’ టైటిల్ సాంగ్ బాగుంది. జె. యువరాజ్ సినిమాటోగ్రఫీ చాలా వరకూ మాతృక లోని ఫ్రేమ్స్ తోనే సాగింది. ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్ ఓకే. ఓవర్ ఆల్ గా ప్రొడక్షన్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. అది తెర మీద కనిపిస్తోంది.

విశ్లేషణ:
ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో రీమేక్‌ చేస్తున్నారంటే ప్రేక్షకులు కచ్చితంగా రెండు చిత్రాలకూ పోలిక పెడతారు. అందులో ఉన్నది.. ఇందులో లేనిది ఏంటని శూలశోధన చేస్తారు. మరి ఈ రెండు వర్గాల వారిని కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది అని చెప్పొచ్చు. మెయిన్ పాయింట్ ని మేకర్స్ ఎక్కడా కూడా పక్క దారి పట్టించడం అనవసర సన్నివేశాలు పెట్టించడం వంటివి కనిపించకపోవడం బాగా అనిపిస్తుంది.

Maestro movie review in Telugu
Maestro movie review in Telugu

నితిన్, తమన్నా ల విషయానికి వస్తే వారి కెరీర్ లో ఇవి మంచి ఛాలెంజింగ్ రోల్స్, వాటని కూడా వారు అంతే అవుట్ స్టాండింగ్ గా చేసారని చెప్పాలి. అంధుడైన అరుణ్‌ డైలీ లైఫ్‌, పియానోపై అతనికున్న పట్టును చూపిస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. ఒక్కో సన్నివేశాన్ని అల్లుకుంటూ కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఆయా సన్నివేశాలన్నీ సరదాగా, ఉత్కంఠగా సాగుతాయి.

మోహన్‌ ఇంటికి అరుణ్‌ వెళ్లిన సమయానికి అప్పటికే అక్కడ హత్య జరిగి ఉండటంతో కథ కీలక మలుపు తీసుకుంటుంది. అరుణ్‌ పరిస్థితి ఏంటో చూస్తున్న ప్రేక్షకుడికి ముందే తెలియడంతో హత్య గురించి అతను పోలీసులకు ఎలా చెబుతాడు? చెప్పేందుకు చేసే ప్రయత్నాలు ఉత్కంఠగా సాగుతూనే నవ్వులు పంచుతాయి.నిజానికి టబు పోషించిన థ్రిల్లింగ్ క్యారెక్టరే ఈ సినిమాకు ఆయువు పట్టు. ఆ పాత్రకు మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేయడం ఓ రకంగా టఫ్ డెసిషన్. ఆమె సోఫియా పాత్ర పోషించడం తెలుగు వ్యూవర్స్ కు ఓ షాకింగ్ సర్ ప్రైజ్ అనే చెప్పాలి. గత వారం వచ్చిన ‘సీటీమార్’లో కబడ్డీ కోచ్ జ్వాలారెడ్డిగా నటించిన తమన్నా… అందుకు పూర్తి భిన్నమైన పాత్రను ఇందులో చేసింది.

Maestro movie review in Telugu
Maestro movie review in Telugu

విరామ సమయానికి సిమ్రన్‌ చేసిన పని కారణంగా అరుణ్‌కు ఒక విపత్కర పరిస్థితి ఏర్పడుతుంది. దాని నుంచి అతడు ఎలా తప్పించుకుంటాడన్న ఉత్కంఠ ప్రేక్షకుడిలో కలుగుతుంది. ఆ క్రమంలో వచ్చే సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది. చివరిలో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చాడు దర్శకుడు. అదేంటనేది తెరపై చూడాలి. తెలుగు నేటివిటీకి అనుగుణంగా ‘అంధాదున్‌’ తీర్చిదిదిన విధానం బాగుంది. ఇక మొత్తంగా చూసుకుంటూనే ఈ “మాస్ట్రో”.. ఒరిజినల్ చూసిన వారిని ఓవరాల్ గా మెప్పిస్తుంది అలాగే కొత్తగా చూసేవారికి మాత్రం ఇంకా ఇంప్రెస్ చేస్తుంది.

 

REVIEW OVERVIEW
CB Desk
Previous articleGopichand Seetimaarr 6 Days Total Box Office Collection
Next articleReview: Gully Rowdy- Formulaic entertainer