నితిన్ అస్సలు ఆగట్లేదుగా.. అంధుడిగా మరో సినిమా షురూ..!

0
597
Nithiin Nabha Natesh Andhadun telugu remake Nithiin 30 shooting update

లాక్డౌన్ పరిస్థితుల తర్వాత నితిన్ మూడు సినిమాల షూటింగులలో పాల్గొనడం విశేషం. తన గాళ్ ఫ్రెండ్ షాలిని ని పెళ్లి చేసుకున్నాడు. కొత్త పెళ్లికొడుకు సినిమాలు తగ్గిస్తాడేమో అనుకున్నారు. కానీ గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం దుబాయ్ లో “రంగ్ దే” సినిమా పాటల షూటింగ్ చేస్తున్నాడు.. మొన్నే చంద్రశేఖర్ యేలేటి తీస్తున్న “చెక్” సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ పూర్తి చేశాడు.

ఇపుడు కొత్తగ “అంధధూన్” రీమేక్ షూటింగ్ షురూ చేశాడు దుబాయ్ లోనే, హిందీలో సూపర్ హిట్టయిన అంధాధూన్ రీమేక్ ను నితిన్ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో అంధుడు. ఇప్పుడీ గెటప్ లోకి నితిన్ కూడా మారాడు. నల్ల కళ్లజోడు తగిలించాడు. స్వెట్టర్ వేసుకున్నాడు. ఇలా నితిన్ పై మొదటి షెడ్యూల్ ను దుబాయ్ లో స్టార్ట్ చేశారు. ఈ రేంజులో దూకుడు మీదున్నాడు. 2021లో ఈ మూడు సినిమాలు విడుదల చెయ్యాలని పట్టుదలగా ఉన్నాడు.

ఈ షెడ్యూల్ లో నితిన్ తో పాటు హీరోయిన్ నభా నటేష్ కూడా జాయిన్ అయింది. వీళ్లిద్దరి మధ్య వచ్చే కీలక సన్నివేశాల్ని ఈ షెడ్యూల్ లో తీస్తారు. మరో కీలక పాత్రధారి తమన్న, జనవరి నుంచి జరగనున్న షెడ్యూల్ లో జాయిన్ అవుతుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. తమన్న ఇందులో నెగెటివ్ రోల్ లో కనిపించనుంది. మహతి స్వరసాగర్ సంగీతం అందిస్తున్నాడు.