‘భీష్మ’ ఫస్ట్ డే కలెక్షన్స్!

2490
NIthiin Bheeshma Telugu Movie collections
NIthiin Bheeshma Telugu Movie collections

(Nithiin Rashmika Bheeshma first day collection, Bheeshma Collection, box office report) నితిన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా భీష్మ. రష్మిక మందన కథానాయిక. వెంకీ కుడుముల దర్శకుడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. ఈ శుక్రవారం సినిమా థియేటర్లలోకి రిలీజైన సంగతి తెలిసిందే. వరుసగా 3 డిజాస్టర్లు పడిన తర్వాత స్టార్ హీరోలే హిట్టు కొట్టడానికి కిందా మీదా పడతారు.. అలాంటిది మీడియం హీరో పై అంత ఎక్ష్పెక్టేషన్స్ ఉంటాయని ఎంత వరకూ చెప్పగలం. అయితే అలాంటి సెంటిమెంట్లను బ్రేక్ చేస్తూ నితిన్ స్ట్రాంగ్ కం బ్యాక్ కు రెడీ అయ్యాడు.

ఈ చిత్రం మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. శివరాత్రి సెలవు కూడా కలిసి రావడం.. స్పెషల్ గా కొన్ని ఏరియాల్లో మిడ్ నైట్ షోలు కూడా వెయ్యడంతో.. నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. నితిన్ కెరీర్ లో మరో బెస్ట్ ఓపెనింగ్ సాధ్యమైందని ట్రేడ్ విశ్లేషిస్తోంది. భీష్మ తొలి రోజు 8.07 కోట్లు వసూలు చేసింది. నితిన్ కి ఇదే బెస్ట్ అని చెబుతున్నారు.. ఈ శని- ఆదివారాలు భీష్మకు వసూళ్ల పరంగా డోఖా ఉండదని భావిస్తున్నారు. మొదటి రోజు ఏపీ-తెలంగాణ వసూళ్ల లెక్కలు పరిశీలిస్తే..

నైజాం 2.29 cr
సీడెడ్ 0.81 cr
ఉత్తరాంధ్ర 0.64 cr
ఈస్ట్ 0.67 cr
వెస్ట్ 0.56 cr
కృష్ణా 0.41 cr
గుంటూరు 0.77 cr
నెల్లూరు 0.27 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.72 cr
ఓవర్సీస్ 0.93 cr
వరల్డ్ వైడ్ టోటల్ 8.07 cr (share)

 

‘భీష్మ’ చిత్రానికి 22.7 కోట్ల బిజినెస్ జరిగింది. మొదటి రోజు ఈ చిత్రం 8.07 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇంకా ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే మరో 14.63 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మూవీ ఆద్యంతం వినోదం పండించడం లో సఫలమయ్యారన్న టాక్ వచ్చింది. మరో పెద్ద సినిమా రిలీజయ్యే వరకూ భీష్మ కలెక్షన్లకు డోఖా ఉండకపోవచ్చని విశ్లేషిస్తున్నారు. సో మొదటి వీకెండ్ ను ఈ చిత్రం బాగా క్యాష్ చేసుకుని 50శాతం పైనే రికవరీ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.