జూన్11 న నితిన్ మరో సినిమా

343
nithin-locked-release-date-for-his-another-movie
nithin-locked-release-date-for-his-another-movie

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఈ ఏడాదిలోనే వరుసగా మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు నితిన్ చేసిన రెండు సినిమాలు రంగ్ దే, చెక్‌ చిత్రాల రిలీజ్ డేట్‌లు ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు.

 

 

ఈ సినిమా నితిన్ కెరీర్‌లో చేస్తున్న 30వ సినిమా. ఈ చిత్రాన్ని హిందీ అంధాధున్ సినిమా రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తమన్నా, నభా నటేష్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మర్లపాక గాంధీ దర్శకత్వంలో ఎన్ సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

 

 

ఈ సినిమాను జూన్11 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. నితిన్ చేసిన చెక్ సినిమా ఫిబ్రవరి26, రంగ్ దే మార్చి 26న థియేటర్లలోకి రానున్నాయి. నాలుగు నెలల వ్యవధిలో నితిన్ వరుసగా మూడు సినిమాల రిలీజ్ డేట్లను ప్రకటించారు.