నితిన్ రంగ్ దే నుంచి ‘బస్టాండే బస్టాండే ‘ పాట

195
nithin-rang-de-bus-stande-bus-stande-lyrical-song
nithin-rang-de-bus-stande-bus-stande-lyrical-song

హీరో నితిన్, కీర్తి సురేష్ ల తొలి కాంబినేషన్ లో వస్తున్న కలర్ ఫుల్ చిత్రం ‘రంగ్ దే’. ‘సితార ఎంటర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. యువ దర్శకుడు ‘వెంకీ అట్లూరి’ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ‘రంగ్ దే‘ చిత్రం నుంచి విడుదల అయిన తొలి గీతానికి కోటికి పైగా వ్యూస్ వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాలోని మరో పాట వీడియోను ఈరోజు విడుదల చేసింది చిత్రం యూనిట్.

 

 

 

‘సింపుల్ గుండే లైఫు.. టెంపుల్ రన్ లా మారే..ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే’ అంటూ నితిన్ పెళ్లి తరువాత కష్టాలను వర్ణించినట్లుగా అర్ధమవుతోంది. శ్రీమణి సాహిత్యం సమకూర్చగా, గాయకుడు సాగర్ గాత్రంలో ఈ గీతం ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఈ గీతానికి అందించిన స్వరాలు సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తాయి. ‘రంగ్ దే’ చిత్రం మార్చి 26న విడుదల అవుతున్న నేపథ్యంలో చిత్రం ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి.