Nithin Up Coming 3 Films Latest Updates
Nithin Up Coming 3 Films Latest Updates

టాలీవుడ్ లో యంగ్ యాక్టర్స్ లో నితిన్ కూడా ఫైనెస్ట్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్నాడు.కానీ సరయిన సినిమాలు ఎంచుకోకపోవడంతో సై తరువాత హిట్ కోసం ఏకంగా ఎనిమిదేళ్లు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది.ఇష్క్ తో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి హిట్స్ అందుకున్న నితిన్ మళ్ళీ రీసెంట్ గా హ్యాట్రిక్ ఫ్లాప్స్ అందుకున్నాడు.దిల్ రాజు లాంటి ప్రొడ్యూసర్ కాలిక్యులేషన్ కూడా తప్పి శ్రీనివాసకల్యాణం ప్లాప్ గా నిలవడంతో ఆలోచనలో పడిన నితిన్ ఆల్మోస్ట్ సంవత్సరం పాటు ఖాళీగానే ఉన్నాడు.

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చాలా కాలిక్యులేటెడ్ గా సినిమాలు ఓకే చేసాడు అని ఇప్పుడు అర్ధమవుతుంది.షార్ట్ గ్యాప్ లో ఒకటి కాదు,రెండు కాదు ఏకంగా మూడు సినిమాల అన్నౌన్మెంట్స్ వచ్చాయి.వాటిలో మొదటిది ఛలో తో హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల డైరెక్షన్ లో చేస్తున్న భీష్మ.ఈ సినిమాకి కమిట్ అయ్యి చాలా రోజులు అయ్యింది.కానీ ఫుల్ ప్లెడ్జెడ్ బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటే తప్ప సెట్స్ మీదకు వెళ్ళడానికి నితిన్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో అతన్ని మెప్పించే స్క్రిప్ట్ తో సినిమా స్టార్ట్ చేసారు.రష్మిక హీరోయున్ గా నటిస్తున్న ఈ సినిమాకి కొబ్బరికాయ కొట్టారు.

[INSERT_ELEMENTOR id=”3574″]

నితిన్ చంద్ర శేఖర్ ఏలేటి చెప్పిన కథ విన్నాడు,ఇంప్రెస్ అయ్యాడు అని ఎప్పుడో టాక్ వచ్చింది.ఆ టాలెంటెడ్ డైరెక్టర్ తో కొత్త తరహా సినిమా చెయ్యడానికి నితిన్ కూడా ఓకే అన్నాడు.కానీ ఆ సినిమా ఇప్పట్లో స్టార్ట్ అయ్యే అవకాశాలు లేవు అనుకున్నారు.కానీ సైలెంట్ గా భవ్య ప్రొడక్షన్స్ లో ఆ సినిమాకి కూడా కొబ్బరికాయ కొట్టి మొదలుపెట్టేశారు.పైగా ఆ సినిమాలో వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.నితిన్ ఈ రెండు సినిమాలు ప్యారెలెల్ గా చేసి వాటి రిజల్ట్ చూసాక నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేస్తాడు అనుకున్నారు అంతా.

[INSERT_ELEMENTOR id=”3574″]

కానీ నితిన్ మాత్రం ఒక్క రోజు గ్యాప్ లో మూడో సినిమా కూడా అనౌన్స్ చేసేసాడు.తొలిప్రేమ తో హిట్,మిస్టర్ మజ్ను తో ప్లాప్ అందుకున్న వెంకీ అట్లూరి తన స్టోరీ తో నితిన్ ని ఇంప్రెస్ చేసాడు.దాంతో ‘రంగ్ దే’ అని ఆ సినిమాకి టైటిల్ ఫిక్స్ చేసారు.’గిమ్మీ సమ్ లవ్’ అనేది సినిమా క్యాప్షన్.కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.కానీ ఇది కూడా భీష్మ సినిమాని నిర్మిస్తున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే తెరకెక్కాలి.అందుకే అన్నీ రెడీ గా ఉన్నా కూడా భీష్మ షూటింగ్ 50 శాతం కంప్లీట్ అయ్యాక ఈ సినిమా సెట్స్ మీదకి వెళుతుంది.

ఈ మూడు సినిమాలు మినిమం గ్యారంటీ కాబట్టే నితిన్ ఓకే అన్నాడు అని తెలుస్తుంది.ఈ మూడు సినిమాల తరువాత నితిన్ తన మార్కెట్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది అనే ఆలోచనలో ఉన్నాడు.ఆ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా నితిన్ మాత్రం సేఫ్ సైడ్ లో ఉంటాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]