Homeసినిమా వార్తలునితిన్ సినిమాకి ఓటీటీ నుంచి భారీ ఆఫర్

నితిన్ సినిమాకి ఓటీటీ నుంచి భారీ ఆఫర్

Nithin Rang De OTT : లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతబడడంతో ఓటీటీ ప్లాట్ ఫాంలు ప్రత్యామ్నాయంగా నిలిచాయి. సినిమా స్థాయిని బట్టి భారీ రేట్లు ఆఫర్ చేస్తూ పలువురు నిర్మాతలను ఆకర్షిస్తున్నాయి. హిట్, ఫ్లాపులతో సంబంధం లేకుండా కళ్లముందే టేబుల్ ప్రాఫిట్స్ కనిపిస్తుండడంతో కొందరు నిర్మాతలు తమ చిత్రాలను డైరెక్టుగా డిజిటల్ రిలీజ్ కి ఇచ్చేస్తూ రిలాక్స్ అవుతున్నారు కూడా.

లాక్ డౌన్ మూలంగా థియేటర్లు మూతబడడంతో, పూర్తయిన సినిమాలు కూడా కొన్ని విడుదల కాకుండా ఆగిపోయాయి. ఇలాంటి చిత్రాల నిర్మాతలకు ఓటీటీ మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. పైగా, ఓటీటీ ప్లేయర్స్ మంచి రేటును కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పటికే ఓటీటీ లో విడుదల కాగా.. హీరో నాని నటించిన ‘వి'” సినిమా కూడా ఓటీటీ వేదికగా విడుదల అయ్యింది.

ఈ క్రమంలో యంగ్ హీరో నితిన్ నటించిన ‘రంగ్ దే’ చిత్రానికి కూడా ఓటీటీ ప్లేయర్ల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయట. తాజాగా నితిన్ రంగ్ దే చిత్రానికి ప్రముఖ ఓటిటి సంస్థ నుండి దాదాపు రూ. 35 కోట్ల ఆఫర్ వచ్చిందట. అయితే చిత్ర యూనిట్ మాత్రం రూ. 40 కోట్లు డిమాండ్ చేశారట. అయితే 40 కోట్ల ఇవ్వడానికి ఓటీటీ సంస్థ నో చెప్పడంతో సినిమాను సంక్రాంతి బరిలోథియేటర్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారట చిత్రయూనిట్.

ఈ సినిమాలో అందాల భామ కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY