పవర్ స్టార్ సరసన నిత్యామీనన్..!

Nithya Menen Next Movie With Pawan Kalyan: తొలిసారి పవన్‌కల్యాణ్‌ – నిత్యమేనన్‌ జోడీ కట్టనున్నారు. ఇద్దరూ కలిసి ఈ నెల 12 నుంచి మొదలయ్యే చిత్రీకరణతో కెమెరా ముందుకు అడుగు పెడుతున్నారు. అయ్యప్పనుమ్ కోషియమ్ తెలుగు రీమేక్ రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది.

యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుంటే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రిన్ ప్లే – సంభాషణలు అందిస్తుండడం విశేషం. ఇందులో పవన్‌కల్యాణ్‌, రానా దగ్గుబాటి కథానాయకులుగా నటిస్తున్నారు. రానాకి జోడీగా ఇప్పటికే ఐశ్వర్య రాజేష్‌ని ఎంపిక చేశారు.

Ayyappanum Koshiyum Remake Nithya menen Next movie with Pawan Kalyan

పవన్‌ సరసన నటించే కథానాయిక ఎంపిక కోసం కొంతకాలం అన్వేషణ సాగించిన చిత్రబృందం ఆ స్థానాన్ని నిత్యమేనన్‌తో భర్తీ చేశారు. పవన్‌ – నిత్య జోడీ కట్టనున్నారనే విషయం ఇదివరకే వినిపించింది. అదే నిజమైంది. ఈ నెల 12 నుంచి హైదరాబాద్‌లో మొదలయ్యే కొత్త షెడ్యూల్‌తోనే నిత్య సెట్లోకి అడుగుపెట్టనుంది.

వీరిద్దరి పై కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫస్ట్ టైమ్ వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ పోలీస్‌ అధికారిగా కనిపిస్తారు. పవన్ – రానా ఫస్ట్ టైమ్ కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles