పవర్‌స్టార్‌ పెయిర్‌ ఫిక్స్‌ #PSPKRanaMovie

0
669
Nithya Menon to romance with Pawan kalyan on #PSPKRanaMovie

#PSPKRanaMovie: Bheemla Nayak: పవన్ కళ్యాణ్ – రానా ల కాంబినేషన్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా సితార ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నం:12 గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యువ దర్శకుడు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి థమన్ మ్యూజిక్ అందిస్తుండగా..త్రివిక్రమ్ మాటలు అందించడం విశేషం. ఇందులో పవన్‌ సతీమణి పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంలో ఎన్నో రోజుల నుంచి చర్చ సాగింది.

శుక్రవారం ఆ సందేహాలన్నింటికీ తెరదించుతూ హీరోయిన్‌ పేరు అధికారికంగా ప్రకటించారు. నిత్యామేనన్‌ ఇందులో నటిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు రానాకు జోడీగా నటి ఐశ్వర్యా రాజేశ్‌ సందడి చేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌ గా ఈ మూవీ తెరకెక్కుతుంది.

 

 

Previous articleNithya Menen to play the female lead in Bheemla Nayak #PSPKRanaMovie
Next articleరివ్యూ: సత్యదేవ్‌ తిమ్మరుసు