రానా విరాటపర్వంలో.. మరో టాప్ హీరోయిన్

380
Nivetha Pethuraj In A Key Role In Rana’s Virataparvam

దగ్గుబాటి రానా – సాయిపల్లవి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ”విరాటపర్వం”. ‘నీదీ నాదీ ఒకే కథ’ ఫేమ్ వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. నీది నాది ఒకే కథ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న వేణు ఉడుగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి బ్రేక్ తీసుకున్న చిత్ర యూనిట్ ఇటీవలే తిరిగి చిత్రీకరణ ప్రారంభించారు. ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

అయితే ఈ చిత్రంతో ఓ కీలక పాత్ర కోసం హీరోయిన్ నివేత పేతురాజ్ ని తీసుకున్నారు. ఈరోజు నుంచే నివేథా పేతురాజ్ షూటింగ్ లో జాయిన్ అవుతున్నారని అఫిసియల్ గా ప్రకటించారు. ఇక కథ విషయానికి వస్తే.. ఇది రెగ్యులర్ స్టోరీ కాదు. నక్సలిజం, ప్రేమ మధ్య సాగే కథ. ఇందులో ప్రియమణి, సాయిపల్లవి లతో పాటు నందితాదాస్, జరీనా వాహబ్ కూడా నటిస్తున్నారు.

ఈ చిత్రంలో నవీన్ చంద్ర – సాయి చంద్ – బెనర్జీ – రాహుల్ రామకృష్ణ – నాగినీడు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నాడు. హాలీవుడ్ కు చెందిన డానీ సాంచెజ్ లోపెజ్ – దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.ఇంత మంది కథానాయికలు ఇందులో నటిస్తుండడంతో ఇది కథానాయికల ప్రాథాన్యత ఉన్న సినిమా అని తెలుస్తుంది. మరి.. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతోన్న విరాటపర్వం ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.