Nivetha Thomas Will Play Important Role In Prabhas 21

ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్‌లో నటిస్తోన్న ప్రభాస్‌.. ఈ మూవీ తరువాత మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్‌ డైరెక్షన్‌లో నటించబోతున్న విషయం తెలిసిందే. సైన్స్‌ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీలో దీపికా పదుకునే హీరోయిన్‌గా నటించనున్నారు. ప్రభాస్ కెరీర్లో 21వ చిత్రంగా రానున్న ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అశ్వినీ దత్ నిర్మించనున్నారు.

ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ నివేదా థామస్ నటిస్తుందని గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. నాని నటించిన జెంటిల్ మెన్ సినిమా తో పరిచయమైన నివేదా థామస్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. ‘నిన్ను కోరి’ ‘జై లవకుశ’ ‘బ్రోచేవారెవరురా’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర ఉందని.. అది కూడా ప్రభాస్ చెల్లెలి క్యారెక్టర్ అని.. దీని కోసం నాగ్ అశ్విన్ నివేదా థామస్ ని సంప్రదించారని న్యూస్ వచ్చింది.

విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న నివేదా థామస్.. ప్రభాస్ కి సిస్టర్ గా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో చూడాలి. ఇక ఈ బ్యూటీ నటించిన ‘వి’ సినిమాలో సెప్టెంబర్ 5న ఓటీటీలో రిలీజ్ కానుంది.