No buyers for Suriya Kaappaan (Bandobast) Movie In Tollywood
No buyers for Suriya Kaappaan (Bandobast) Movie In Tollywood

తమిళ్ హీరో అయిన సూర్య గజినీ సినిమాతో హిట్ అందుకున్నప్పటనుండి సినిమా సినిమాకి తన మార్కెట్ పెంచుకుంటూ వచ్చాడు.ఒకానొక దశలో సూర్య సినిమాకి తెలుగు స్టార్ హీరోలతో సమానంగా మార్కెట్ ఉండేది.కానీ ప్రస్తుత పరిస్థితి వేరు.

ఈ మధ్య సూర్య సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్స్ గా నిలుస్తుండటంతో సూర్య రీసెంట్ సినిమా బందోబస్త్ కి బయ్యర్స్ కరువయ్యారు.NGK సూర్య మార్కెట్ ని తగ్గించడం కాదు పూర్తిగా క్లోజ్ చేసింది.KV ఆనంద్-సూర్య ల క్రేజీ కాంబో లో వస్తున్న ఈ సినిమాని పిలిచి తక్కువ రేట్స్ కి ఇస్తున్నా కొనే పరిస్థితి లేదు.పైగా ఈ సినిమాలో మోహన్ లాల్ కూడా నటించాడు.సూర్య తో పాటు ఆర్య,సయేశా లాంటి స్టార్స్ సపోర్టింగ్ ఉన్నా,మినిమమ్ రేట్ కోట్ చేసినా కూడా బందోబస్త్ సినిమా కొనడానికి ఎవరూ ముందుకు రావట్లేదు.

గతంలో తమ దగ్గర కొన్న సినిమాలకు ఎక్కువగా నష్టం వస్తే లైకా వాళ్ళు ఆ నష్టాన్ని భర్తీ చేసిన సందర్భాలు ఉన్నాయి.ఆ భరోసా మీద కూడా ఈ సినిమా కొనడానికి గానీ,పార్టనర్ షిప్ లో రిలీజ్ చెయ్యడానికి గానీ ఎవరూ ఓకే అనట్లేదు.సూర్య మార్కెట్ ఇంతగా డామేజ్ అయ్యిందా అని అంతా ఆశ్చర్యపోతున్నారు.ఈ నెల 20 న ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలి అనుకుంటున్నారు.ఇప్పుడున్న సిట్యుయేషన్ చూస్తుంటే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని తెలుగులో ఓన్ రిలీజ్ చేసుకోవాల్సి వచ్చేలా ఉంది.