టాలీవుడ్ లో గత కొన్ని సంవత్సరాలుగా బెనిఫిట్ షోలు, paid ప్రీమియర్స్ అంటూ కొత్త ట్రెండు మొదలైన విషయం తెలిసిందే.. పెద్ద చిన్న హీరోలు అని తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమాకి బెనిఫిట్ షోలు వేస్తున్నారు ప్రొడ్యూసర్లు.. వీటికి గవర్నమెంట్ నుండి కూడా పర్మిషన్లు ఇవ్వడం జరుగుతుంది.. అయితే రీసెంట్ గా అల్లు అర్జున్ సినిమా అయినా పుష్ప టు విడుదల సందర్భంగా జరిగిన ఇన్సిడెంట్ తో తెలంగాణ గవర్నమెంట్ కొత్త నిర్ణయాలు తీసుకుంది.
ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అసెంబ్లీలో.. సినిమాకు సంబంధించిన హీరోలందరూ తమ షూటింగులకు సంబంధించిన రాయితీలు అలాగే టిక్కెట్లు రేట్లు పెంపు గురించి మీరు ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతులు తీసుకోండి… కానీ ప్రజల ప్రాణాలకు ఎటువంటి ఆపద కలిగిన ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు అన్నారు..
ఆ తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఇక నుండి తెలంగాణ రాష్ట్రంలో సినిమాలకు సంబంధించిన టిక్కెట్లు రేట్లు అలాగే బెనిఫిట్స్ కి అనుమతులు ఉండవని తేల్చి చెప్పేశారు.. దీనితో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అందరూ ఒక్కసారిగా కంగు తిన్నారు.. భారీ బడ్జెట్లో సినిమాలు తీసి టిక్కెట్లు రేట్లు మొదటి పది రోజులు పెంచకపోతే సినిమా కి పెట్టిన ఖర్చు ఎలా రికవరీ అయింది అంటూ చర్చ నడుస్తుంది..
అంతేకాకుండా సంక్రాంతికి బాలకృష్ణ, రామ్ చరణ్ అలాగే వెంకటేష్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.. ఇవి సినిమాలు భారీ బడ్జెట్ తో తరికెక్కిస్తున్నారు మరి టిక్కెట్లు రేట్లు బెనిఫిట్స్ లేకపోతే వీటి పరిస్థితి ఏంటి అంటూ సోషల్ మీడియాలో కూడా న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.