“అజ్ఞ్యాతవాసి” వచ్చి రెండేళ్లయ్యింది..అయినా రికార్డ్ ఎవరూ కొట్టలే

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వదిలేసి మొన్న జనవరి 10 వ తారీఖుతో రెండేళ్లు పూర్తి అయ్యింది.ఇప్పుడు సినిమాల్లోకి వస్తారో లేదో విషయం ఇంకా క్లారిటీ లేదు కానీ అయితే తన చివరి చిత్రం అయినా సరే ఆ సినిమాకు వచ్చిన హైప్ అంతా ఇంతా కాదు.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన మూడవ చిత్రం కావడంతో ఆ సమయంలో ఈ చిత్రానికి ఏర్పడ్డ అంచనాలు చూసి అదే ఊపులో కానీ హిట్టయ్యి ఉంటే ఎక్కడ ఆగేదో కూడా ఊహించలేకపోయారు.కానీ ఎన్ని అంచనాలు అయితే ఈ చిత్రం నెలకొల్పుకుందో అంతే స్థాయిలో దారుణాతి దారుణమైన పరాజయాన్ని చవి చూసింది.

అయితే అప్పట్లో ఈ చిత్రం ఓవర్సీస్ లో నెలకొల్పిన రికార్డులు మాత్రం ఇంకా చెక్కు చెదరలేదు.ఓవర్సీస్ మార్కెట్ లో “అజ్ఞ్యాతవాసి” చిత్రానికి కేవలం ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ కు పైగా వచ్చేసింది.అప్పుడు పవన్ నెలకొల్పిన రికార్డులు ఈ రోజు వరకూ విడుదల కాబడిన ఏ భారీ చిత్రం కూడా కొట్టలేకపోయింది.అయితే అప్పుడు సినిమా టికెట్ రేట్లు ఎక్కువ అది ఇది అని ఇప్పుడు కొంత మంది అనొచ్చు అప్పుడు రేట్ ఎక్కువయినా సరే టికెట్ తెగింది కదా అలా తెగితేనే ఈ ఫీట్ సాధించిన చిత్రంగా “అజ్ఞ్యాతవాసి” ఇప్పటికీ హాట్ టాపిక్ గానే నిలిచింది.మరి ముందు రాబోయే చిత్రాల్లో ఏ చిత్రం ఈ ఫీట్ ను అందుకుంటుందో చూడాలి.

 

Related Articles

Telugu Articles

Movie Articles