Aishwarya Rai Bachchan , Mani Ratnam, Bollywood Movie News
Aishwarya Rai Bachchan , Mani Ratnam, Bollywood Movie News

ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ పెళ్లయినా,ఒక బిడ్డకు తల్లయినా కూడా ఆమె ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు.రీసెంట్ గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అందరికంటే ఎక్కువ అప్లాజ్ ఆమెకే దక్కింది.అయితే అంతటి అందగత్తె అయిన ఐశ్వర్యారాయ్ ని కాస్త డీ గ్లామరస్ రోల్ లో చూపిస్తేనే ఫాన్స్ ఫీల్ అయిపోతారు.అలాంటిది ఆమెని ఏకంగా నెగెటివ్ రోల్ లో చూపించడానికి ప్రిపేర్ అయ్యాడు లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం.

అయన ఎప్పటినుండో పొన్నియన్ సెల్వన్ అనే సినిమాని తెరకెక్కించాలని కంకణం కట్టుకుని తిరుగుతున్నాడు.మహేష్,రామ్ చరణ్ లు కథని రిజక్ట్ చేసారు.అయితే సినిమాలో అమితాబ్ ని,ఐశ్వర్యారాయ్ ని మాత్రం నటించడానికి ఒప్పించాడు.అయితే ముందు సినిమా నిర్మిస్తా అని చెప్పిన లైకా ప్రొడక్షన్స్ రాజుల బ్యాక్ డ్రాప్ లో ఉండే కావడంతో,బడ్జెట్ ఎక్కువ అవుతుండడంతో వెనక్కి తగ్గింది. సినిమాలో అధికారం కోసం ఏమైనా చేసే ఒక పవర్ ఫుల్ రాణి పాత్రలో ఐశ్వర్య రాయ్ నటిస్తుంది.

మరి ఆమెని అంత నెగెటివ్ గా చూపిస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా? అనే అభిప్రాయం కూడా వినిపిస్తుంది.మరి మణిరత్నం పాత్రని ఎలా డిజైన్ చేసాడు?,ఆమెని ఎలా ఒప్పించాడు అనేది కూడా కన్సిడర్ చెయ్యాలి.మరి భారీ బడ్జెట్ సినిమాకి నిర్మాతలు దొరికితే మాత్రం త్వరలోనే ఐష్ లోని సెకండ్ యాంగిల్ చూడొచ్చు.