Homeసినిమా వార్తలుభారీ ధరకు MEGA 154, వీర సింహా రెడ్డి ఓవర్సీస్ రైట్స్..!!

భారీ ధరకు MEGA 154, వీర సింహా రెడ్డి ఓవర్సీస్ రైట్స్..!!

Mega 154 – Veera Simha Reddy Overseas Rights: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో వచ్చే ఏడాది సంక్రాంతికి 2023 సినిమాలు విడుదల చేయుటకు సిద్ధం చేస్తున్నారు. ఈసారి పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా సంక్రాంతి 2023 బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి సిద్ధమవుతున్నారు. వీటిలో లో చిరంజీవి బాలకృష్ణ అలాగే ప్రభాస్ మూవీలు సిద్ధంగా ఉన్నాయి.

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ తరవాత బాబీ దర్శకత్వంలో Mega 154 సినిమా వస్తున్న విషయం తెలిసిందే. Mega 154 షూటింగు కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు యువ దర్శకుడు బాబీ. మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ ని దివాళి కి విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు Mega 154 సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శృతి హాసన్ ఇందులో కథానాయికగా నటిస్తోంది. ఇక నందమూరి బాలకృష్ణ అఖండ విజయం తర్వాత గోపీచంద్ దర్శకత్వంలో NBK107 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి వీర సింహా రెడ్డి (Veera Simha Reddy) అనే టైటిల్ ఫిక్స్ చేసారు. భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేస్తోంది.

Chiranjeevi Mega 154 Overseas Rights details, Balakrishna Veera Simha Reddy Overseas Rights,

థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. ఇక్కడ సంక్రాంతికి పోటీ పడే రెండు సినిమాలు కూడా ఒకే సంస్థ నుండి రావడం ఇదే మొదటిసారి. Mega 154 అలాగే వీర సింహా రెడ్డి ఓవర్సీస్ రైట్స్ ప్రముఖ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ రెండు భారీ సినిమాల ఓవర్సీస్ హక్కులను (Overseas Rights) భారీ ధరకు ఫార్స్ ఫిలిమ్స్ కంపెనీ వారు దక్కించుకున్నట్లు సమాచారం. పెద్ద హీరోలు ఇద్దరూ ఇప్పటికే తమ సినిమాలతో మంచి జోరు మీద ఉండడంతో, అటు మెగాఫ్యాన్స్ లోనూ ఇటు నందమూరి ఫ్యాన్స్ లోనూ సూపర్ గా అంచనాలు ఉన్నాయి. అలాగే రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడం ఖాయమని మూవీ యూనిట్స్ అభిప్రాయపడుతున్నాయి.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles