Homeసినిమా వార్తలుమరో యాక్షన్ షెడ్యూల్ కి సిద్ధమైన ఎన్టీఆర్....ఈసారి కీలకమైన సన్నివేశాలు.!!

మరో యాక్షన్ షెడ్యూల్ కి సిద్ధమైన ఎన్టీఆర్….ఈసారి కీలకమైన సన్నివేశాలు.!!

NTR 30 new schedule starts from May 17th in Hyderabad. NTR 30 shooting update, Jr NTR, Koratala Siva, NTR birthday special updates, Saif Ali Khan, Janhvi Kapoor, NTR30 shooting location

NTR30 next shooting schedule update: RRR సినిమా తర్వాత నేషనల్ లెవెల్ లో ఎన్టీఆర్ కి పాపులారిటీ వచ్చింది. ఇంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్ టెంపర్ సినిమా తర్వాత వరుసగా ఆరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్స్ తో టాలీవుడ్ లో తన హవా కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30 సినిమా చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మే 20న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా NTR30 టైటిల్ ఫస్ట్ లుక్ ని విడుదల చేయుటకు సిద్ధం చేశారు మేకర్స్.

NTR30 next shooting schedule update: ఇక విషయానికి వస్తే కొరటాల శివ అలాగే జూనియర్ ఎన్టీఆర్ NTR30 షూటింగ్ కి రెడీ అవుతున్నారు.. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో మొదలుపెట్టారు. ఆ తరువాత మొదటి రెండు షూటింగ్ షెడ్యూల్స్ ని ఒకేసారి కంప్లీట్ చేసుకున్న టీం..ఇప్పుడు మే 17 నుండి మూడో షెడ్యూల్ ని ప్రారంభిస్తున్నట్టు సమాచారం. మొదటి రెండు షెడ్యూల్లో యాక్షన్ షూట్ చేయగా.. వాటితో పాటు కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించడం జరిగింది.

ఇప్పుడు జరగబోయే షూటింగ్ షెడ్యూల్లో కూడా సినిమాలో ఉండే కీలకమైన యాక్షన్ ఫైట్స్ ని తీయబోతున్నట్టు తెలుస్తుంది. పది రోజుల పాటు జరగనున్న ఇందులో సైఫ్ అలీ ఖాన్ అలాగే మిగిలిన నటీనటులు కూడా జాయిన్ అవుతారని తెలుస్తుంది. ఈ షూటింగ్ ని హైదరాబాదు స్టూడియోలో వేసిన భారీ సెట్ లో ప్రారంభిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో విడుదలకు సిద్ధం చేస్తున్న ఈ సినిమా షూటింగు అతి త్వరలోనే ముగించి వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ విడుదల చేయుటకు ప్రయత్నాలు చేస్తున్నారు.

NTR 30 new schedule starts from May 17th in Hyderabad

దీని తర్వాత NTR30 సినిమా నాలుగో షెడ్యూల్ను కూడా వచ్చే నెలలో ప్రారంభించడానికి అన్ని రకాల పనులను కొరటాల శివ పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే పోరాట శివ మొదటిసారిగా ఈ సినిమా కోసం VFXకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.. అందుకోసమే ఎక్కువగా బ్లూ మ్యాట్ సీన్స్ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా వచ్చే వారం నుంచి ఎన్టీఆర్ మరోసారి వేటను మొదలు పెట్టబోతున్నాడు.

Web Title: NTR 30 new schedule starts from May 17th in Hyderabad. NTR 30 shooting update, Jr NTR, Koratala Siva, NTR birthday special updates, Saif Ali Khan, Janhvi Kapoor, NTR30 shooting location

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY