NTR 30 update ramyakrishna to play key role for trivikram ntr film here are the details

Trivikram – NTR 30 – Ramyakrishna: త్రివిక్రమ్ సినిమాల్లో మామూలుగా మహిళలను మంచి రోల్ ఉంటుంది. అందులో భాగంగానే అత్తారింటికి దారేదిలో నదియా, ఆ తర్వాత మొన్న వచ్చిన అల వైకుంఠపురములో టబు ఇలా ప్రతి సినిమాలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై రాధాకష్ణ (చినబాబు) – నందమూరి కల్యాణ్ రామ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్‌లో ‘అరవింద సమేత వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ తాజా సినిమా కొంత పొలిటికల్ టచ్ ఉండనుందని టాక్. ప్రస్తుతం ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్ ఆర్ ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ఎన్టీఆర్ పెద్దగా ఏమీ గ్యాప్ లేకుండానే త్రివిక్రమ్ సినిమాకు షిప్ట్ కానున్నాడు.

ఎన్టీఆర్ కెరీర్లో 30వ సినిమాగా రానున్న ఈ చిత్రానికి ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఓ కీలకమైన పాత్ర కోసం సీనియర్ నటి రమ్యకృష్ణ ని సంప్రదిస్తున్నారని తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా శివగామిగా పిలవబడుతున్న రమ్యకృష్ణ.. మళ్ళీ ఫార్మ్ లోకి వచ్చింది. ఈ క్రమంలో ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఛాన్స్ ఉందట. అందులో ఒక హీరోయిన్‌గా అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తే జాన్వీ కపూర్‌ను అనుకుంటున్నారట. ఇక మరో హీరోయిన్‌గా మరోసారి పూజా హెగ్డేనే తీసుకోవాలనీ భావిస్తోందట చిత్రబృందం. పాన్ ఇండియా లెవెల్‌లో అందరికి అప్పిల్ అయ్యేవిధంగా ఈ సినిమా కథను తయారు చేస్తున్నాడట దర్శకుడు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌కు ఆయన స్టార్ ఇమేజ్‌కు తగ్గట్లుగా ఓ అదిరిపోయే క్యారెక్టర్‌ను రాసుకున్నాడట త్రివిక్రమ్.