“ఎన్టీఆర్ 30” లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!

0
3397
NTR and Koratala Siva Next NTR30 Launch Date confirmed

NTR30 Launch Date: ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఆయన అభిమానులు ఎగిరి గంతేసే సమాచారం అందింది. గత ఏడాది సమ్మర్‌ లో ప్రారంభం అవ్వాల్సిన ఎన్టీఆర్‌ శివ కొరటాల ల కాంబో మూవీ ఈ ఏడాది సంక్రాంతికి విడుదల అవ్వాల్సి ఉంది. కాని కరోనా మొత్తం తలకిందులు చేసింది. ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్ఆర్‌ మూవీ ని పూర్తి చేయక పోవడం వల్ల ఇప్పటి వరకు శివ కొరటాల తో మూవీని కనీసం ప్రారంభించలేక పోయాడు.

ఈ నేపథ్యంలో “ఎన్టీఆర్ 30” లాంచ్ కి ముహూర్తం ఖరారయ్యిందట. తాజా సమాచారం ప్రకారం సినిమా అక్టోబర్ మొదటి వారంలో గ్రాండ్‌గా లాంచ్ అవుతుంది. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇది ఎన్టీఆర్ కెరీర్‌లో 30 వ సినిమా.

అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చనున్నారు. ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ గానీ, లేదంటే అలియా భట్ కానీ హీరోయిన్ గా నటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కన్పించబోతున్నట్టు సమాచారం.

NTR and Koratala Siva Next NTR30 Launch Date confirmed

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. ఎన్‌టిఆర్ మరియు శివ బ్లాక్‌బస్టర్ జనతా గ్యారేజ్ (2016) తర్వాత రెండవ సినిమా ఎన్టీఆర్ 30.