NTR31 shooting start date, NTR and Prashanth Neel next NTR 31 shooting details, NTR31 cast crew, NTR31 budget and NTR31 updates, NTR31 Heroine.
మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. ప్రపంచ వ్యాప్తంగా తిరుగులేని అభిమానాన్ని, క్రేజ్‌ను సంపాదించుకున్న హీరో. ఆయన కథానాయకుడిగా కె.జి.యఫ్, కె.జి.యఫ్ 2 వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌ను తెరకెక్కించి త్వరలోనే సలార్‌తో సందడి చేయనున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. రీసెంట్ గానే దేవరా మేకర్స్ రెండు భాగాలుగా వస్తున్నట్లు ప్రకటి విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ సలార్ మూవీ రెండో భాగం కూడా ఏప్రిల్ కల్లా పూర్తి అవుతుంది కాబట్టి మేకర్స్ ఈ అనౌన్స్మెంట్ చేసినట్టు తెలుస్తుంది.
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న భారీ బడ్జెట్ చిత్రం, ఏప్రిల్ 2024 నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఎంతో ప్రెస్టీజియస్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాయి. వస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా గాను దాదాపు 300 కోట్ల బడ్జెట్ (NTR31 Budget) తో నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది దీనితోపాటు ప్రశాంత్ నేను ఇతర ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు (NTR31 cast crew) కూడా ఈ సినిమాలో తీసుకోబోతున్నారు.
ఈ సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో అందరికీ తెలిసిందే. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ ధీటుగా మేకర్స్ మూవీని నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సిద్ధం చేస్తున్నారు. అందరూ ఆశ్చర్యపోయేలా భారీ యాక్షన్ చిత్రాలను తెరకెక్కించే ఈ డైరెక్టర్ మరోసారి ఎన్టీఆర్‌తో అందరినీ మెప్పించేలా యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కించబోతున్నారు.