NTR Biopic, Balakrishna, Kathanayakudu Movie Review , Tollywood Movie Review
NTR Biopic, Balakrishna, Kathanayakudu Movie Review , Tollywood Movie Review

విడుదల తేదీ : ఫిబ్రవరి 22, 2019
రేటింగ్ : 2/5
నటీనటులు : బాలకృష్ణ , విద్యాబాలన్, రానా, కళ్యాణ్ రామ్, వెన్నల కిషోర్ తదితరులు.
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
నిర్మాత : నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి
సంగీతం : కీరవాణి
సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్
ఎడిటర్ : రామకృష్ణ

బాలకృష్ణ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కొంతమేర అంచనాలు అందుకున్నా కూడా కమర్షియల్ గా మాత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.దాంతో ఆ ఫెయిల్యూర్ వెనుక ఉన్న కారణాలు అనలైజ్ చేసుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి,కొన్ని సీన్స్ మళ్ళీ షూట్ చేసి మరీ ఎన్టీఆర్ మహానాయకుడు సినిమాని మలిచారు ఈ సినిమా టీమ్.క్రిష్ కృషి,బాలయ్య నమ్మకం ఈ సారయినా నిలబడిందా?,ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 ప్రేక్షకులని అలరించిందా లేదా అనేది ఇప్పడు చూద్దాం.

కథ:

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ పెట్టడం అనే పాయింట్ తో ముగుస్తుంది.సెకండ్ పార్ట్ లో పార్ట్ జెండా నిర్మాణం,ఆ తరువాత తెలుగుదేశం పార్టీ ని పవర్ లోకి తీసుకురావడానికి ఎన్టీఆర్ చేసిన ప్రచారం వాటి వాటితో సినిమా నడుస్తుంది.ఎన్నికల్లో TDP ఘనవిజయం సాధించిన తర్వాత ఎన్టీఆర్ ని పదవి నుండు దించడానికి ప్రధానిమంత్రితో కుమ్మక్కవవుతాడు టీడీపీ నిర్మాణంలో మెయిన్ పిల్లర్ గా ఉన్న భాస్కరరావు.దాంతో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యిందని భావించిన ఎన్టీఆర్ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఎలాంటి పోరాటం జరిపాడు,ప్రజా పోరాటంతో మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎలా అధికారాన్ని చేజిక్కించుకున్నాడు? అనే విషయాలతో పాటు బసవతారకం కన్నుమూయడం తదితర రియల్ ఇన్సిడెంట్స్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

విశ్లేషణ:

ఇది తెలుగువాళ్లందరికి తెలిసిన ఎన్టీఆర్ నిజజీవిత కథతో తెరకెక్కిన సినిమా కావడంతో కాస్త ఎక్కువ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్న కూడా నిజనాలను వక్రీకరించారు అనేస్తారు.అయినా కూడా క్రిష్ కొంతవరకు లిబర్టీ తీసుకోకతప్పలేదు.సినిమాని సినిమాలా చూడకుండా పోకిటికల్ ఫ్లేవర్ కూడా టచ్ అవ్వడంతో,పైగా త్వరలో ఎలెక్షన్స్ కూడా వస్తుండడంతో చంద్రబాబు పాత్ర కి కాస్త ఎక్కువ స్కోప్ ఇచ్చారు.అలా ఇవ్వాలి వచ్చింది.

ఎమోషన్స్ ని పేర్చుకుంటూ ఈ సినిమా తియ్యాలని చూసినా కూడా కొన్ని కొని చోట్ల అది అనుకున్నంతగా ఎలివేట్ కాలేదు.దాంతో డ్రామా పండలేదు.విద్య బాలన్ సీన్స్ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అవుతాయి.ఇక ఎన్టీఆర్ పదవి నుండి తప్పించబడ్డాక మళ్ళీ అసెంబ్లీ లోకి అడుగుపెట్టినప్పడు వచ్చే సీన్స్ లో ఉండాల్సిన ఎలివేషన్స్ సరిగా ఎలివేట్ కాలేదు.మొత్తం సినిమాలో కూడా ఎన్టీఆర్ స్థాయికి తగ్గ ఎలివేషన్స్ మాత్రం లేవు.నిడివి తక్కువగా ఉండడం సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్.

నటీనటులు:

ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో ఎన్టీఆర్ గా నటించిన బాలయ్య యంగ్ ఏజ్ లో ఎన్టీఆర్ గా కనిపించినప్పుడు రిసీవ్ చేసుకోవడం కాస్త ఇబ్బందిగా అనిపించింది.కానీ ఈ సినిమాలో ఎక్కువగా వయసు మళ్ళిన పాత్రలోనే కనిపించడంతో చాలా చోట్ల ఎన్టీఆర్ లానే కనిపించాడు.కాకపోతే ఎన్టీఆర్ లో సహజంగానే ఉండే గాంభీర్యాన్ని చూపించాల్సి వచ్చినప్పుడు మాత్రం బాలయ్య నటన ఇంకాస్త సహజంగా ఉండాల్సింది అనిపిస్తుంది.

ఎమోషనల్ సీన్స్ వరకు మాత్రం బాలయ్య బాగా నటించాడు.ఇక బసవతారకం పాత్రలో విద్య బలం నటనకి పేరు పెట్టడానికి లేదు.చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ తో తోనే బోలెడంత భావాలని పలికించింది.చంద్రబాబు నాయుడు గా మెప్పించడానికి రానా చాలా హార్డ్ వర్క్ చేసాడు.అక్కడక్కడా బోడి లాంగ్వేజ్ అండ్ డైలాగ్ డెలివరీ లో చంద్రబాబు ని ఫాలో అయిపోయాడు.భాస్కరరావు గా నాదెళ్ల 100% న్యాయం చేసాడు.ఆ పాత్రలోని సైలెంట్ అండ్ సాఫ్ట్ కన్నింగ్ నేచుర్ ని బాగా ఎలివేట్ చెయ్యగలిగాడు.హరికృష్ణగా కళ్యాణ్ రామ్ పర్లేదు.ఎన్టీఆర్ అల్లుడు వెంకటేశ్వర రావు గా భరత్ రెడ్డి బాగా సెట్ అయ్యాడు.మిగతా నటీనటులంతా తమ పాత్రల పరిధిమేర నటించారు.

టెక్నీషియన్స్:

మొదటి పార్ట్ ని కూడా సెన్సిబుల్ గానే తీర్చిదిద్దినా కూడా కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలవడంతో ఈ సినిమావరకు ఎక్కువగా ఎమోషన్స్ ని నమ్ముకున్నాడు క్రిష్.ఎన్టీఆర్ తో ముడిపడిన ప్రతి అంశాన్ని కూడా ఎమోషనల్ టచ్ తోనే డీల్ చెయ్యాలని చూసాడు.అయితే కీలకమయిన ఎపిసోడ్స్ ని తీర్చిదిద్దంలో మాత్రం తడబడ్డాడు.దాంతో ఎన్టీఆర్ మళ్ళీ తిరిగి అధికారాన్ని చెక్కిక్కించుకునే సీన్స్ లాంటివి మామూలుగా అనిపించాయి.

చంద్రబాబు నాయుడు పాత్రని పెంచడం,tdp లో అతని ఇంపార్టెన్సీ తెలిసేలా చెయ్యడం కోసం పెట్టిన సీన్స్ అక్కడక్కడా సినిమాని డీవియేట్ చేసాయి.ఓవరాల్ గా చూసుకుంటే క్రిష్ కి డైరెక్టర్ గా పాస్ మార్క్స్ పడతాయి.ఇక సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ చాలావరకు పేలాయి.జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్.అతను వాడిన టోనింగ్ వల్ల సినిమాని చాలా చోట్ల వింటేజ్ లుక్ వచ్చింది.కీరవాణి సంగీతం ఓకే అనిపిస్తుంది.నిర్మాణ విలువలు బావున్నాయి.

ఫైనల్ గా:

ఎన్టీఆర్ మహానాయకుడు ఎక్కువమందికి తెలిసిన అంశాలతోనే తెరకెక్కింది.క్రిష్ మార్క్ ఎమోషనల్ టచ్,బాలయ్య నటన వంటివి హైలైట్స్ గా నిలిచిన ఎన్టీఆర్ మహానాయకుడు ఒక మోస్తరు విజయం అందుకునే అవకాశాలున్నాయి.కమర్షియల్ గా ఈ సినిమా ఎంతవరకు పెర్ఫార్మ్ చేస్తుంది అనేది వేచి చూడాలి.

బోటమ్ లైన్:ఎన్టీఆర్ మహానాయకుడు…ఒక మోస్తరుగా ఉన్నాడు