వచ్చే ఏడాది పెద్ద హీరోల సినిమాల రిలీజ్ డేట్స్ కోసం ఇప్పటినుండి టాలీవుడ్‌లో పోటీ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాల విషయానికొస్తే, షూటింగు మొదలు పెట్టక ముందే విడుదల తేదీని ప్రకటిస్తున్నారు. విడుదల తేదీని గుర్తు పెట్టుకొని దర్శకులు కూడా ఆ సినిమా షూటింగ్ పూర్తి చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ రోజుల్లో టాలీవుడ్‌లో విడుదల తేదీలను ముందుగానే ప్రకటించడం ఆనవాయితీగా మారింది.
అంతకుముందు సినిమాల పూర్తి అయిన తర్వాత మంచి రోజు చూసుకుని దర్శక నిర్మాతలు విడుదల తేదీని ప్రకటించేవారు కానీ ఇప్పుడు అన్ని పాన్ ఇండియా సినిమాలు కావడంతో ముందుగానే డేట్ ని ప్రకటిస్తున్నారు అంతేకాకుండా ఇతర భాషలలోని తెలుగు చిత్రాలకు ఇప్పుడు మంచి ఆదరణ లభిస్తోంది. ఇతర భాషల్లో కూడా మన సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో విడుదల తేదీకి ఇప్పుడు ప్రాధాన్యత ఏర్పడింది.
జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమా ఏప్రిల్ 4న థియేటర్లలోకి రానుందని గతంలోనే ప్రకటించారు మేకర్స్. అయితే ఇప్పుడు దేవర సినిమాకి పోటీగా చాలా పెద్ద హీరోలు విడుదల చేసింది ప్రకటించే పనిలో ఉన్నట్టు తెలుస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాని ఏప్రిల్‌లో థియేటర్లలోకి రానుంది. అధికారిక తేదీ ఇంకా సెట్ కాలేదు. పవన్ కళ్యాణ్- సుజిత్ దర్శకత్వంలో వస్తున్న పాన్-ఇండియన్ చిత్రం ఓజీ కూడా ఏప్రిల్‌లో థియేటర్లలోకి రానుందని ప్రస్తుతం ఫిలింనగర్ లో టాక్ నడుస్తుంది.
వీటితోపాటు కళ్యాణ్ కృష్ణ కొరసాల దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించేందుకు మెగాస్టార్ చిరంజీవి సిద్ధమయ్యారు. ఏప్రిల్‌లో సినిమా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్‌లో రామ్ చరణ్, శంకర్ నటించిన గేమ్ ఛేంజర్‌ని మెగా నిర్మాత దిల్ రాజు విడుదల చేయాలని భావిస్తున్నారు. వీటిని గమనిస్తే ఏప్రిల్ 2024 లో ఎన్టీఆర్ పోటి ఇచ్చేందుకు ముగ్గురు మెగాహీరోలు సిద్ధమవుతున్నారు.
ఈ మూడు సినిమాల్లో ఒక హీరో సినిమా అయినా ఎన్టీఆర్ కి పోటీగా వస్తుందని సమాచారమైతే తెలుస్తుంది. ఇవి భారీ బడ్జెట్ చిత్రాలు. ఏప్రిల్ నెల వరుస సెలవులు ఉండటంతో దర్శక నిర్మాతలు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పోటీలో ఎవరు ఉంటారు? ఎవరు విడుదల తేదీని మార్చుకుంటారో అనేది ఆసక్తికరంగా మారింది.
April 2024 telugu movie release dates, NTR Devara clash with Pawan Kalyan OG, Chiranjeevi and Allu Arjun Pushpa 2, Devara Movie, Telugu Upcoming movies
