(NTR fight scene video leaked in RRR movie, RRR Movie latest updates and Ram charan Jr NTR RRR movie leaks)రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి ఇప్పటికే ఓ వీడియో లీక్ అయింది. అరకు షెడ్యూల్ లో ఎన్టీఆర్ తలపాగా పెట్టుకొని నటిస్తున్న ఓ సీన్ ను ఎవరో షూట్ చేసి లీక్ చేశారు. ఇప్పుడు మరోసారి ఆర్ఆర్ఆర్ నుంచి మరో వీడియో లీక్ అయింది. ఈసారి కూడా ఎన్టీఆర్ నటించిన సన్నివేశమే కావడం ఆశ్చర్యం.
ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ పై తీసిన పులి ఫైట్ వీడియో లీక్ అయింది. దీంతో యూనిట్ వెంటనే అప్రమత్తమైంది. కాపీరైట్ ఇష్యూ కింద సోషల్ మీడియాలో పెట్టిన వీడియోస్ అన్నింటినీ డిలీట్ చేసింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కు ఓ పులి ఫైట్ పెట్టాడు దర్శకుడు రాజమౌళి. ఈ సీక్వెన్స్ ను జక్కన్న అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించాడు. సినిమా మెయిన్ ఎట్రాక్షన్స్ లో ఇది కూడా ఒకటి. అలాంటి సన్నివేశం కాస్తా ఇప్పుడు లీక్ అయింది. ఫేస్ బుక్, ట్విట్టర్ లోంచి వీడియోనైతే డిలీట్ చేయించారు కాబట్టి, వ్యక్తిగత మొబైల్స్ లోకి చేరిన వీడియోల్ని డిలీట్ చేయడం ఎవరి వల్ల కాదు. ప్రస్తుతం ఈ వీడియో వాట్సాప్ లో వైరల్ అవుతోంది. లక్షలకొద్దీ గ్రూపుల్లో షేర్ అవుతోంది. అలా విడుదలకు ముందే సినిమాలో అత్యంత కీలకమైన ఎన్టీఆర్-పులి ఫైట్ ను చాలామంది చూసేస్తున్నారు. వీడియోలో కొమరం భీమ్ పాత్రలో ఉన్న ఎన్టీఆర్ పరుగెడుతున్న స్టయిల్ బాగుందంటూ సోషల్ మీడియాలో అంతా కామెంట్స్ పెడుతున్నారు.
గ్రాఫిక్స్ డిపార్ట్ మెంట్ నుంచి ఆ 30 సెకెన్ల సీన్ లీక్ అయిందనే విషయం స్పష్టంగా అర్థమౌతూనే ఉంది. రామౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఫైట్. చాలా కష్టపడి తీసిన ఫైట్ కూడా. చివరికి ఈ ఫైట్ ను ప్రచారంలో కూడా వాడకూడదని, కేవలం సినిమాలోనే ఉంచాలని భావించాడు జక్కన్న. అలాంటిది ఇప్పుడిలా లీక్ అయి వైరల్ అయిపోయింది. ఎన్టీఆర్ ఇంట్రో లో భాగంగా ఈ ఫైట్ సీక్వెన్స్ వస్తుందట.ఈసారి మరింత కట్టుదిట్టమైన చర్యల మధ్య షూటింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.