RRR సినిమాతో నష్టపోయిన యంగ్ టైగర్..!!

Jr NTR Lost Remuneration: ప్రపంచ వ్యాప్తంగా RRR సినిమా గురించి ప్రేక్షకులు చాలా ఎదురు చూశారు. అనుకోని కారణాలవల్ల సినిమా వాయిదా వేశారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా వేసినా RRR మూవీ ని రాజమౌళి పక్కా ప్లాన్ తో జనవరి 7న రిలీజ్ చేద్దామని చూశారు. కరోనా థర్డ్ వేవ్ దెబ్బకు విడుదల విషయంలో వెనక్కి వెళ్ళింది.

అయితే ఈ RRR మూవీ లో నటించిన రామ్ చరణ్ (Ram Charan) అలాగే జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కి చాలా నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఎక్కువ నష్టపోయింది ఎన్టీఆర్ అని టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఏడాది ఒకటి లేదా రెండు సినిమాలతో విడుదల చేసే ఎన్టీఆర్ ఈసారి RRR సినిమాకి మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకున్నాడు.

జూనియర్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ (NTR remuneration) విషయానికి వస్తే ఒక్క సినిమా గాను 30 కోట్లు తీసుకుంటారని టాక్ వినిపిస్తుంది. అరవింద సమేత తర్వాత ఆయన రేంజ్ రూ.50 కోట్లకు వెళ్లిందని చెబుతారు. అంటే ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కి దాదాపు 150 కోట్ల రూపాయలు నష్టపోయారని చెప్పాలి. ఇంచుమించు రామ్ చరణ్ (Ram Charan) కూడా అంతే నష్టం జరిగిందని టాక్ వినిపిస్తోంది.

Jr NTR loss remuneration Because of RRR Movie
Jr NTR loss remuneration Because of RRR Movie

పెద్ద హీరో సినిమాలు అంటే వేలాది మంది పని చేస్తారు, ఏడాదికి ఒక్క సినిమా వేసుకున్న, మూడేళ్లకు మూడు సినిమాలు వస్తాయి అలాగే ఇంకో రెండు సినిమాల్ని ప్రారంభిస్తారు అంటే మొత్తం మీద నాలుగు సినిమాలు ఈ మూడేళ్లలో జూనియర్ ఎన్టీఆర్ కి ఆగిపోయింది అని చెప్పకనే చెప్పవచ్చు. ఎన్టీఆర్ ఈ సినిమాలు చేసి ఉన్నట్లయితే ఎన్నో వేల మందికి ఆయన కారణంగా ఉపాధి కలిగేది.

Related Articles

Telugu Articles

Movie Articles