Jr Ntr birthday: తారక్ బర్త్ డే నాడే NTR31 ప్రకటన ?

0
20
r NTR Prashanth Neel NTR31 movie announcement on NTR birthday

Jr Ntr birthday on 20th May: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్.ఆర్ ఆర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఎన్టీఆర్ బర్త్ డే ఎంతో దూరంలో లేదు. మే 20వ తేదీనే తారక్ బర్త్ డే కోసం యంగ్ టైగర్ ఫ్యాన్స్ వేచిచూస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ‘NTR30’ సినిమా అనౌన్స్ చేసాడు తారక్. అలాగే తారక్ ఫ్యాన్స్ కోసం మైత్రి మూవీ మేకర్స్ తమ తదుపరి ప్రాజెక్టుపై ఓ ప్రకటన చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.

కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ‘#NTR31’ ప్రాజెక్ట్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది. తారక్ బర్త్ డే నాడు తారక్-ప్రశాంత్ నీల్ కాంబోలో రానున్న చిత్రంపై మైత్రి మూవీ మేకర్స్ అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందట.

Read Also: ప్రభాస్ డ్యుయెల్ రోల్.. ఓ పాత్రలో ఆర్మీ ఆఫీసర్​గా 

నిజానికి తారక్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ భారీ ప్రాజెక్ట్ ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గతేడాది ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ప్రశాంత్ నీల్ – మైత్రీ టీమ్ వేసిన ట్వీట్స్ తో వీరి కలయికలో సినిమా చేయనున్నట్లు అర్థం అయింది. ప్రస్తుతం కరోనా సంక్షోభం నడుస్తున్నందున తారక్ బర్త్ డే సెలబ్రేషన్స్‌కి దూరంగా ఉండాలని నిర్ణయించుకోగా.. మైత్రి మూవీ మేకర్స్ మాత్రం తారక్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు గురించి ప్రకటించేందుకు తారక్ బర్త్ డే కంటే కరెక్ట్ టైమ్ మరొకటి లేదని భావిస్తున్నట్టు ఫిలింనగర్ టాక్.

Read Also: ఆగష్టు లో మొదలుకానున్నతెలుగు బిగ్ బాస్-5