యంగ్ టైగర్ ఎన్టీఆర్ RRR సినిమా తర్వాత ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర (Devara) సినిమా షూటింగ్ జరుపుకుంటున్నారు. ఈ సినిమాపై అటు ఫ్యాన్స్ లోనూ అలాగే మూవీ లవర్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ (NTR) సినిమా విషయంలో ఎంత జాగ్రత్త వహిస్తారో అదే విధంగా కుటుంబం సంబంధించిన విషయాల్లో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పిల్లల విషయంలో ఒక షాకింగ్ తీసుకున్నట్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక విషయంలోకి వెళ్తే ప్రస్తుతం సమాచారం మేరకు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు రాజమౌళి (Rajamouli) అలాగే మహేష్ బాబు (Mahesh Babu) కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కీలకమైన పాత్రల్లో చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది అలాగే ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ తీసుకున్న షాపింగ్ డెసిషన్ ఏమిటంటే ఇద్దరు పిల్లల్ని సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని హెచ్చరించినట్టు తెలుస్తుంది.
ఎందుకంటే కత్తికి రెండు వైపులా పొద్దున ఉన్నట్టు సోషల్ మీడియాలో పాజిటివ్ అలాగే నెగటివ్ ప్రచారాలు కూడా ఉంటాయి. అయితే ఎన్టీఆర్ ఉద్దేశంలో తన కొడుకులు నెగిటివిటీకి దూరంగా ఉండాలని.. చదువుకునే వయసులో సోషల్ మీడియాకి అలవాటు పడితే ఆ ప్రభావం కెరియర్ మీద అలాగే చదువు మీద ఉంటుందని తారక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తారక్ నటిస్తున్న దేవర (Devara Shooting) సినిమా స్టోరీ మీద చాలా జాగ్రత్తలు తీసుకొని షూటింగ్ షూటింగు జరుపుతున్నారు. ఎందుకంటే రాజమౌళితో సినిమా తీసిన తర్వాత ఆ హీరోకి ఫ్లాప్ ఉంటుందని వార్త అందరికి తెలిసిందే, అందుకనే జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ కేర్ ఈ సినిమాపై తీసుకున్నట్టు సినీ వర్గాలు చెప్తున్నారు. దేవర సినిమాలో మాస్ ప్రేక్షకులతో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా నచ్చే అంశాలు సైతం ఎక్కువగానే ఉంటాయని సమాచారం అందుతుంది.
కొరటాల శివ అలాగే ఎన్టీఆర్ సినిమా అయినా దేవరాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కీలకమైన పాత్రలో చేస్తున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు నడుస్తున్నాయి. సమంత తో చేసిన సినిమాలో అనుకున్న స్థాయిలో ఫలితాన్ని అందుకోని ఆరహ ఇప్పుడు దేవర సినిమాతో మంచి హిట్ ను సొంతం చేసుకుంటారని ఫిలిం నగర్ లో టాక్ వినబడుతుంది. ఎన్టీఆర్ (NTR) పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ అలాగే సినిమా కెరియర్ విషయంలో మరో మెట్టు పైకి ఎదగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.