జూలైలో NTR ‘ఎవరు మీలో కోటీశ్వరులు’

0
43
NTR to shoot for Evaru Meelo Koteeswarulu From July

NTR Evaru Meelo Koteeswarulu: బుల్లితెర హిస్టరీలో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి హోస్ట్ చేసి అనేక సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. తాజాగా రియాలిటీ గేమ్ షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ద్వారా మరికొద్ది రోజుల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర సందడి చేయబోతున్నారు. తాజాగా సమాచారం ప్రకారం ”ఎవరు మీలో కోటీశ్వరులు” టీవీ షో షూటింగ్ జూలై రెండో వారం నుంచి ప్రారంభం కానుంది. 

ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో పాటుగా ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. రామ్ చరణ్ తో కలసి ఒక సాంగ్ షూట్ చేస్తే తారక్ కు సంబంధించిన చిత్రీకరణ పూర్తైపోతుంది. అందుకే టీవీ గేమ్ షో స్టార్ట్ చేయాలని యంగ్ టైగర్ నిర్ణయించుకున్నారట.

ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో క్కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసిన తర్వాత టీవీలో టెలికాస్ట్ అయ్యే తేదీని ప్రకటించే అవకాశం ఉంది.  జెమిని టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఐదో సీజన్‌ ప్రోమో రిలీజ్ కాగా.. ఎన్టీవోడు అదరగొట్టాడు. ‘ఇక్కడ కథ మీది కల మీది.. జీవితాన్ని మారుద్దాం రా.. ఆట నాది కోటి మీది.. రండి గెలుద్దాం’ అంటూ మీసం మెలేసి మరీ చెప్తున్నాడు ఎన్టీఆర్.