NTR Next Devara part 2 and Nelson Dilipkumar movie updates: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూట్‌ను 2025 జనవరి కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరి నుంచి ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కబోయే డ్రాగన్ (Dragon – NTR Neel) సినిమా షూటింగ్ పనులు మొదలు పెడతారు. ఎన్టీఆర్ ఈ సినిమాకు పూర్తి సంవత్సరం సమయం కేటాయించబోతున్నారు. డ్రాగన్ చిత్రాన్ని సంక్రాంతి 2026 నాటికి విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్ .
ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ దేవర 2 (Devara Part 2) సినిమా షూటింగ్ కూడా మొదలు పెట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శకుడు కొరటాల శివ పార్ట్ 2 కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలు పెట్టారని సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నప్పటికీ దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ఎన్టీఆర్‌కు కథ చెప్పిన విషయం తెలిసిందే.
సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగ వంశీ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా కోసం నిర్మాత దర్శకుడు కి అడ్వాన్స్ కూడా భారీగానే ఇచ్చారని ఫిలింనగర్ లో టాక్ గెట్టిగా వినపడుతుంది. ఈ ప్రాజెక్ట్ 2026 ప్రారంభంలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. అయితే ఎన్టీఆర్ దేవర 2 ఎప్పుడు ప్రారంభిస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
మాకు అందిన ఎక్స్‌క్లూజివ్ అప్డేట్ ప్రకారం, ఎన్టీఆర్ దేవర 2ను (devara part 2) నెల్సన్ ప్రాజెక్ట్ పూర్తయ్యాక మాత్రమే ప్రారంభిస్తారని తెలుస్తుంది. అంటే దేవర 2 సినిమాని 2026 చివరిలో మాత్రమే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఇంకా, కొరటాల శివ (Koratala Siva) తన తదుపరి చిత్రాలకు కూడా సన్నాహాలు చేస్తున్నారు. మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్‌తో ఒక చిత్రానికి చర్చలు జరుపుతున్నారు. అలాగే, టాలీవుడ్ సూపర్‌స్టార్ కోసం మరో కథపై కూడా పనిచేస్తున్నారు. ప్రస్తుతం దేవర 2 ఇంకా చాలా సమయం తీసుకునేలా కనిపిస్తోంది.