Latest Posts

ఎన్టీఆర్ వార్ 2 లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..!

- Advertisement -

NTR War 2 Shooting Latest Update: దేవర బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా వార్ 2.. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతున్నారు. హృతిక్ రోషన్ హీరోగా కీర అద్వానీ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాని అయన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. సినిమా మొదటి షెడ్యూల్ ఎన్టీఆర్ లేకుండా హృతిక్ రోషన్ పై షూటింగ్ జరిపిన విషయం తెలిసిందే అలాగే దీని తర్వాత రొమాంటిక్ సాంగ్ కూడా షూట్ చేయడం జరిగింది.. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ అలాగే హృతిక్ రోషన్ పై షూటింగ్ జరుగుతుంది..

పదిరోజుల క్రితం యాక్షన్ సన్నివేశాలని పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు మరో షెడ్యూల్ కి రెడీ అవుతున్నారు.. ఈరోజు ఉదయం ముంబైకి బయలుదేరి వెళ్లిన ఎన్టీఆర్ రేపటినుండి వార్ 2 లేటెస్ట్ షెడ్యూల్లో జాయిన్ కాబోతున్నారు.. అయితే ఈ షూటింగ్ లో ఎన్టీఆర్ సోలోగా వచ్చే సన్నివేశాలని చిత్రీకరిస్తున్నట్టు సమాచారమైతే తెలుస్తుంది… అంతేకాకుండా హృతిక్ రోషన్ కాంబినేషన్ సన్నివేశాలను కూడా చేస్తున్నట్టు సమాచారం..

- Advertisement -

ఇప్పటికే వార్ 2 సినిమాలో వీళ్ళిద్దరిపై వచ్చే కొన్ని సన్నివేశాలని అలాగే యాక్షన్ ఫైట్స్ ని కూడా టీం షూటింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఇప్పటికే సినిమా నుండి లీక్ అయిన ఎన్టీఆర్ లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. దేవర సినిమాతో నార్త్ సైడు మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో మరింత ఫ్యాన్ బేస్ సంపాదించుకునే అవకాశం చాలా ఎక్కువగానే కనబడుతుంది.. అలాగే తన రాబోయే సినిమాలు కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు సిద్ధమవుతున్నాయి..

NTR next War 2 shooting update, NTR Upcoming movie news, Jr NTR next movie, Hrithik roshan and NTR Action fights, War 2 movie latest news

- Advertisement -

Latest Posts

Trending News

Related Articles