NTR Birthday special updates: మే నెలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే ఉండటంతో ఫ్యాన్స్ అందరికీ పండగ లాంటి వాతావరణం వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేస్తూ ఉంటారు. మరి ఈసారి జూనియర్ ఎన్టీఆర్ అలాగే కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న NTR30 సినిమా అప్డేట్ ఏదైనా ఇస్తారా అంటూ ఫ్రాన్స్ ఎదురుచూస్తున్నారు.. మరి మేకర్స్ నిజంగానే NTR30 సర్ప్రైజ్ ఇస్తున్నారా?
NTR Birthday special updates: NTR30 సినిమాపై ఫ్యాన్స్ అలాగే మూవీ లవర్స్ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. RRR వంటి సినిమా తర్వాత రావటం.. కొరటాల శివ రెండోసారి ఎన్టీఆర్ తో చేయటంతో ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. NTR30 షూటింగు రెండు షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకోగా.. కొరటాల శివ టీం ఇప్పుడు మే 17 నుండి కొత్త షూటింగ్ షెడ్యూలు ప్రారంభించడానికి రెడీ అవుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ బర్తడే మే 20 కావటంతో ఈసారి తను షూటింగ్ స్పాట్ లోనే ఉంటారు. అలాగే మేకర్స్ కూడా ఫాన్స్ కోసం ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ (First Look) తో పాటు టైటిల్ కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే అందుతున్న సమాచారం మేరకు NTR30 మేకర్స్ టైటిల్ (Title) ఇప్పుడే విడుదల చేయొద్దు అంటూ కావాలంటే ఫస్ట్ లుక్ విడుదల చేయండి అంటూ సూచన చేసినట్టు చెబుతున్నారు.
పాన్ ఇండియా లెవెల్ లో విడుదలకు సిద్ధం చేస్తున్న ఈ సినిమాకి కొరటాల శివ పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఆ పవర్ ఫుల్ టైటిల్ ఎలా ఉంటదంటే విడుదల చేస్తున్న అన్ని భాషల్లోనూ కనెక్ట్ అయ్యేలా ఉంటుందంట. మరి ఎన్టీఆర్ బర్త్ డే సర్ప్రైజ్ మరింత క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
NTR30 సినిమాలో జాహ్నవి కపూర్ హీరోయిన్గా చేస్తున్న విషయం తెలిసిందే. విలన్ రోల్ సైఫ్ అలీ ఖాన్ అలాగే శ్రీకాంత్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. వీరితోపాటు సాయి పల్లవి కూడా ఈ సినిమాలో ఉన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరికొన్ని రోజులు పోతే గాని ఈ సినిమాకు సంబంధించిన నటీనటుల వివరాలు తెలుస్తాయి. ప్రస్తుతం RFC వేసిన షూటింగ్ సెట్స్ లో ఈ సినిమా జరుగుతుంది.