NTR30 Latest Shooting Update: RRR సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న సినిమా NTR30. ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాల శివ ఈ సినిమాపై చాలా నేను నమ్మకంతో పనిచేస్తున్నారు. అలాగే సినిమాకు తగ్గట్టు చాలా రకాలుగా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం ఎన్టీఆర్ 30 షూటింగ్ డేటు అలాగే రిలీజ్ డేట్ ని ప్రకటించడం జరిగింది. అయితే దీని తర్వాత ఎటువంటి అప్డేట్ రాలేదు మూవీ టీం దగ్గర నుంచి.
NTR30 Latest Shooting Update: ట్విట్టర్‌లో ఎన్టీఆర్ 30 రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. సినిమా ట్రెండ్‌కు సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అనేక హ్యాష్‌ట్యాగ్‌లను రూపొందించారు. చుట్టూ ఉన్న సందడి అలాంటిది. అయితే, మేకర్స్ ఎలాంటి కొత్త అప్‌డేట్‌లు ప్రకటించలేదు.
2023 నూతన సంవత్సర పండుగ సందర్భంగా, నిర్మాతలు సినిమా విడుదల తేదీని ఏప్రిల్ 5, 2024గా ప్రకటించారు. దీనితోపాటు ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తా అంటూ ప్రకటించడం జరిగింది. అది పక్కన పెడితే, తదుపరి అప్‌డేట్‌లు ఏవీ ప్రకటించబడలేదు. దీనితో ఎటువంటి అప్డేట్ రాకపోయేటప్పటికి మళ్లీ సినిమా ఆగిపోయింది అంటూ అలాగే మార్చి లేదా ఏప్రిల్ లో షూటింగ్ స్టార్ట్ అవుతుందంటూ రూమర్స్ స్టార్ట్ చేశారు యాంటీ ఫ్యాన్స్.
అయితే అందుతున్న సమాచారం మేరకు, NTR30 సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని అలాగే షూటింగ్ కి సంబంధించిన సెట్ వర్క్ కూడా చివరి దశలో ఉన్నట్టు తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆస్కార్ నామినేషన్ లో “RRR”లోని “నాటు నాటు” ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా నామినేట్ చేయబడింది.
ఈ వేడుకకు ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి హాజరుకానున్నారు. ఇది పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ – కొరటాల సినిమా NTR30 షూటింగ్ అనేది స్టార్ట్ అవుతుందని సోర్స్ తెలియజేయడం జరిగింది. NTR30 షూటింగ్ కూడా మార్చి నెలలో మొదలు పెడతారని చెప్పడం జరిగింది.