Homeట్రెండింగ్ఇది నిజమైతే..ఎన్టీఆర్ అభిమానులకు పండగే..!!

ఇది నిజమైతే..ఎన్టీఆర్ అభిమానులకు పండగే..!!

NTR30 Shooting Update: RRR మూవీ కి మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకున్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ తో NTR30 అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. అదిగో ఇదిగో NTR30 షూటింగ్ స్టార్ట్ అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ ఈ సినిమా పైన వస్తూనే ఉంటుంది. కానీ ప్రతిసారి అది పోస్ట్ పోన్ అవుతూనే ఉంది.

RRR సినిమా జపాన్ లో విడుదల సందర్భంగా అక్కడ ప్రమోషన్స్ చేయడానికి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు హైదరాబాద్ కి తిరిగి రావడం జరిగింది. NTR30 స్టోరీ స్క్రిప్ట్ సంబంధించి సినిమా ప్రొడ్యూసర్స్ లో ఒకరైన కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కొరటాల శివ NTR30 షూటింగ్ కి సంబంధించిన సెట్స్ పనిలో బిజీగా ఉన్నట్టు కొన్ని రోజుల క్రితం ఫిలిం సర్కిల్ లో హడావుడి చేశారు. ఆ తర్వాత మళ్ళీ దీనిపై ఎటువంటి సమాచారం ఎవరూ ఇవ్వలేదు. ఇప్పుడు ‘RRR’ ప్రమోషన్స్ కోసం రామ్ చరణ్ రాజమౌళితో కలిసి జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ (NTR) తిరిగి ఇండియా వచ్చేశాడు.

NTR30 Shooting from November 2022
NTR30 Shooting from November 2022

అయితే కళ్యాణ్ రామ్ NTR30 షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఇప్పుడు NTR కూడా దృష్టి పెట్టడం మొదలు పెట్టారు. త్వరలోనే కొరటాల ఫైనల్ డ్రాఫ్ట్ ని వినిపించబోతున్నారట. ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే నవంబర్ లో మంచి ముహూర్తం చూపుకుని ప్రారంభోత్సవాన్ని చేయబోతున్నారట.

ఇక రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్నాయి. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని నిర్మించబోతున్నారు. మరి ఈసారైనా అనుకున్న విధంగా NTR30 సినిమా షూటింగ్ మొదలు అయితే ఫాన్స్ కి ఇంకా పండగే..

 

Related Articles

Telugu Articles

Movie Articles