NTR’s Devara OTT Rights Sold, Jr NTR Devara movie digital rights details, Netflix acquired Devara movie OTT rights for big price. Devara shooting update
జనతా గ్యారేజ్ సినిమా తర్వాత కొరటాల శివ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కలిసి చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమా షూటింగు ప్రస్తుతం హైదరాబాదు లొకేషన్స్ లో జరుగుతుంది. ఆచార్య సినిమా తర్వాత కొరటాల శివ ఈ సినిమా కోసం చాలా జాగ్రత్తలు తీసుకొని చేస్తున్నట్టు సినిమా వర్గాల వారు చెప్తున్నారు. పూర్తిగా యాక్షన్ సన్నివేశాలతో షూటింగ్ జరుపుకుంటున్న ఈ దేవర సినిమాని ఏప్రిల్ 5న విడుదలకు చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
RRR సినిమా తరువాత పాన్ ఇండియా లెవెల్ లో దేవర సినిమా రావటం తో బారిగా అంచనాలు ఉన్నాయి ఈ సినిమాపై. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ సినిమా దేవరాకి ఒకపక్క షూటింగ్ జరుగుతూనే మరోపక్క సినిమాకు సంబంధించిన బిజినెస్ కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. మేకర్స్. లేటెస్ట్ గా అందుతున్న సమాచారం మేరకు దేవర సినిమాకు సంబంధించిన డిజిటల్ అలాగే ఓటిటి రైట్స్ ని ప్రముఖ Netflix OTT సంస్థ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది.
అందుతున్న సమాచారం మేరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ దేవర సినిమాని హిందీ హక్కులతో కలిపి భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ డీల్ గురించి తెలిసిన ట్రేడ్ వర్గాల వారు ఎన్టీఆర్ కెరియర్ లోనే హైయెస్ట్ డీల్ జరిగిందని చెబుతున్నారు. జాహ్నవి కపూర్ హీరోయిన్ గా చేస్తున్న దేవర సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ లో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీగానే అంచనాలు పెట్టుకున్నారు.