గుణశేఖర్ రానా హిరణ్యకశ్యప సినిమాలో అభయ్ రామ్ ..?

భారీ సెట్స్ – వీఎఫెక్స్ – భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన గుణశేఖర్.. అద్భుతమైన టేకింగ్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడు. అలాగే స్టార్ కిడ్స్ తో సినిమా చేయడంలో కూడా ప్రసిద్ధి చెందారు. ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన నందమూరి వారసుడు జూనియర్ NTR ని లీడ్ రోల్ లో తీసుకొని ‘రామాయణం’ చిత్రాన్ని రూపొందించారు గుణశేఖర్.

రుద్రమదేవి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ”Shaakuntalam” అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న గుణశేఖర్. శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో అర్హ (Allu Arha) నటించబోతున్నట్లుగా ప్రకటించారు. అర్హ తో షూటింగ్ కూడా మొదలు పెట్టేసాడు. గుణశేఖర్ తదుపరి ప్రాజెక్ట్ లో మరో స్టార్ కిడ్ ని ఇంట్రడ్యూస్ చేయనున్నారని టాక్ నడుస్తోంది.

ఎన్టీఆర్ తనయుడు అభయ్ రామ్. దగ్గుబాటి రానా తో తలపెట్టిన ‘హిరణ్యకశ్యప’ సినిమాతో అభయ్ ను గుణశేఖర్ లాంచ్ చేయాలని చూస్తున్నారట. నందమూరి మూడో తరాన్ని ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత తీసుకుంటారో లేదో చూడాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే. ఇకపోతే ప్రస్తుతం గుణశేఖర్ రూపొందిస్తున్న ‘శాకుంతలం’ చిత్రంలో సమంత అక్కినేని ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

 

Show comments

Related Articles

Telugu Articles

Movie Articles