Homeసినిమా వార్తలుటైగర్ నాగేశ్వరరావు నుంఛి నూపూర్ సనన్ ఫస్ట్ లుక్ విడుదల.!

టైగర్ నాగేశ్వరరావు నుంఛి నూపూర్ సనన్ ఫస్ట్ లుక్ విడుదల.!

Nupur Sanon first look from Ravi Teja's Tiger Nageswara Rao, Actress Nupur Sanon HD gallery, Nupur Sanon hot images and upcoming movie news, Ravi Teja Nupur Sanon movie details

ఇటీవల గ్లింప్స్ విడుదలైన తర్వాత ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ బజ్ మరింత గా పెరిగింది. మాస్ మహారాజా రవితేజ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. వంశీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన నూపుర్ సనన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ రోజు, మేకర్స్ టైగర్ లవ్ సారాగా నూపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. రైలు విండో సీట్లో కూర్చున్న నూపూర్ తన లవ్ ని కలుసుకోవడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు ఫస్ట్ లుక్ లో కనిపిస్తోంది. ఎత్నిక్ వేర్‌లో ఉన్న పోస్టర్‌లో చాలా బ్యుటీఫుల్ గా వుంది. బాలీవుడ్ నటి కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో గాయత్రి భరద్వాజ్‌ మరో హీరోయిన్.

Nupur Sanon First Look From Tiger Nageswara Rao
Nupur Sanon First Look From Tiger Nageswara Rao

రవితేజ కెరీర్ లో అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు’. కథకు యూనివర్సల్ అప్పీల్ ఉన్నందున మేకర్స్ దీనిని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఆర్‌ మదీ ఐఎస్‌సి, సంగీతం జివి ప్రకాష్‌ కుమార్‌ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకాంత్ విస్సా డైలాగ్ రైటర్ కాగా, మయాంక్ సింఘానియా సహ నిర్మాత.

ఈ చిత్రం ‘టైగర్ దండయాత్ర’ అనే టీజర్ వైరల్‌గా మారి అంచనాలని పెంచింది. వరుసగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ ది కాశ్మీర్ ఫైల్స్ , కార్తికేయ 2 చిత్రాలను రూపొందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న విడుదల చేస్తున్నారు.

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY