ఓ పిట్ట కథ మూవీ రివ్యూ

2343
O Pitta Katha telugu Movie Review, Rating
O Pitta Katha telugu Movie Review, Rating

ఓ పిట్టకథ మూవీ రివ్యూ
రేటింగ్: 2.75/5
నటీనటులు: సంజయ్‌ రావు, విశ్వంత్‌ దుద్దంపూడి, నిత్యా శెట్టి, బ్రహ్మాజీ..
నిర్మాత: వి. ఆనందప్రసాద్‌
దర్శకత్వం: చెందు ముద్దు
సినిమాటోగ్రఫీ: సునీల్‌ కుమార్‌ యన్‌
మ్యూజిక్: ప్రవీణ్‌ లక్కరాజు
ఎడిటర్‌: డి.వెంకటప్రభు
రన్ టైం: 2 గంటల నిముషాలు
విడుదల తేదీ: మార్చి 06, 2020

బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ఓ పిట్ట కథ. తనకున్న పలుకుబడిని వాడి బ్రహ్మాజీ ఈ చిత్రానికి చేయాల్సినదంతా చేసాడు. సూపర్ స్టార్స్ ను రంగంలోకి దించాడు. వినడానికి ఓ పిట్టకథగా అనిపించినా ఇది చాలా పెద్దకథే అంటూ తీశారు నుంచి రిలీజ్ ప్రమోషన్స్ దాకా అందరినీ ఆకట్టుకున్న చిన్న సినిమా ‘ఓ పిట్టకథ’. మెగాస్టార్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రప్పించాడు. మొత్తానికి ఈ చిత్రంపై బజ్ తీసుకురాగలిగాడు. మరి ట్రైలర్ తో ప్రామిసింగ్ అనిపించుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:
వెంకట లక్ష్మి (నిత్య శెట్టి) కిడ్నాప్ అవుతుంది. ఈ విషయంపై పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడానికి విశ్వంత్, వెంకట లక్ష్మి తండ్రి వస్తారు. ఎస్సై బ్రహ్మాజీ అసలు ఏం జరిగిందో తెలుసుకునే క్రమంలో విశ్వంత్ – వెంకటలక్ష్మిల ప్రేమకథ వింటాడు. విశ్వంత్ వెళ్తూ వెళ్తూ ప్రభు (సంజయ్ రావ్) మీద తనకు అనుమానం ఉందని చెబుతాడు. ఇక ఎస్సై ప్రభును విచారించడం మొదలుపెట్టాక వెంకటలక్ష్మితో తనకు కూడా ప్రేమ కథ ఉందని తెలుసుకుంటాడు. ఆ కథ మొత్తం విన్నాక ఎస్సైకు కిడ్నాప్ కు సంబంధించిన క్లూ దొరుకుతుంది. ఈ నేపథ్యంలో వెంకటలక్ష్మికి ఏమైంది, అసలు ఆమెను కిడ్నాప్ చేసిందెవరు? దేనికోసం చేసారు అన్నది మిగిలిన కథ.

నటీనటులు:
కాకినాడ మరియు గోదావరి అందాలను సినిమాటోగ్రాఫర్ సునీల్ కుమార్ అద్భుతంగా చూపించాడు. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ మరియు నటీనటులను ది బెస్ట్ గా ప్రెజంట్ చేశారు. విశ్వంత్ నటుడిగా ఇప్పటికే పలు సినిమాలు చేసాడు. ఈ చిత్రంలో కూడా అతనికి పలు వేరియేషన్స్ చూపించగలిగే పాత్ర వచ్చింది. నిత్యా శెట్టి కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఆమె చూడడానికి కూడా బాగుంది. సంజయ్ రావ్ కు ఇది మొదటి సినిమానే అయినా మెప్పించాడు.

అలాగే సంజయ్ ఫ్రెండ్ పాత్ర అయిన పండు పాత్రలో చేసిన నటుడు సూపర్బ్ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా బాగా నవ్వించాడు. బ్రహ్మాజీ ఓకే. మిగిలిన పాత్రలు చేసిన వారు కూడా వారి పరిధిమేర చేశారు.

సాంకేతిక నిపుణులు:
ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ మరియు నటీనటులను ది బెస్ట్ గా ప్రెజంట్ చేశారు. ప్రవీణ్ లక్కరాజు సాంగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆ విజువల్స్ కి మరింత బ్యూటీని తెచ్చాడు. వెంకట్ ప్రభు ఎడిటింగ్ చాలా స్లోగా ఉంది. ఇంకాస్త బెటర్ గా కట్ చేసి సినిమాని స్పీడప్ చేయాల్సింది. సంగీతం తర్వాత విశేషంగా ఆకట్టుకునేది సినిమాటోగ్రఫీ. ఓ పిట్ట కథలో విజువల్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి. డైలాగ్స్ ఓకే. స్క్రీన్ ప్లే పరంగా మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. చందు ముద్దు దర్శకత్వం పరంగా మంచి మార్కులే వేయించుకుంటాడు. తనలో విషయముంది.

విశ్లేషణ:
ఓ పిట్ట కథ టైటిల్ కు తగ్గట్లే చిన్నగా మొదలై ట్విస్ట్ లతో కొనసాగుతూ హ్యాపీ ఎండింగ్ కు చేరుకుంటుంది. అయితే ఈ ప్రయాణం స్లో గా ఉంటుందన్న ఒక్క విషయాన్ని పక్కనపెడితే సినిమాను ఎంజాయ్ చేయవచ్చు. డైరెక్టర్ చెందు ముద్దు లో బడ్జెట్లో ఒక విజువల్ లవ్ స్టోరీ చెప్పాలనుకున్నాడు.. అన్నీ కుదిరాయి కానీ లీడ్ కాస్టింగ్ లో లో మ్యాజిక్ వర్కౌట్ అవ్వకపోవడంతో ఏ ప్రేమ కథకి పెద్దగా కనెక్ట్ అవ్వరు. కామెడీ, రొమాన్స్, సస్పెన్స్ ఇలా అన్ని విషయాల్లో దర్శకుడు బానే హ్యాండిల్ చేసాడు. మొత్తానికి ఓ పిట్ట కథ ఒకసారి చూసి ఎంజాయ్ చేయదగ్గ చిత్రం.