HomeOTT తెలుగు మూవీస్ఒకే ఒక జీవితం ఓటిటి రిలీజ్ డేట్ - టైం & స్ట్రీమింగ్ పార్టనర్...

ఒకే ఒక జీవితం ఓటిటి రిలీజ్ డేట్ – టైం & స్ట్రీమింగ్ పార్టనర్ వివరాలు

Oke Oka Jeevitham OTT Release Date: హీరో శర్వానంద్ కి టాలీవుడ్ లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. తను తీసే ప్రతి ఒక్క సినిమా కి తేడా చూపిస్తూ అలాగే ఎమోషనల్ స్టోరీస్ ని ఎంపిక చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా శర్వానంద్ కి హిట్ లేకపోయినా అభిమానులు మాత్రం చాలా సినిమాలు చూడటం మానలేదు.

శర్వానంద్ కొత్త సినిమా అయినా ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham) విడుదల అయ్యి మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ప్రభంజనాన్ని సృష్టించింది. శర్వానంద్ ఫాలోవర్స్ అలాగే మూవీ లవర్స్ ఈ సినిమాని ఆదరించారు. ఎప్పటిలాగే థియేటర్ లో విడుదలైన సినిమాలు ఓటిటి (OTT Release) లో విడుదలకు ఎదురుచూసే ప్రేక్షకులు కూడా ఉంటారు.

అలాగే ఇప్పుడు శర్వానంద్ నటించిన ఒకే ఒక జీవితం ఓటిటి (Oke Oka Jeevitham OTT) హక్కులని ‘సోనీలివ్’ (SonyLIV OTT) సంస్థ వారు సొంతం చేసుకున్నారు. ఇప్పటికీ సినిమా థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. సినీ వర్గాలలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. అక్టోబర్ రెండో వారంలో ఒకే ఒక జీవితం సినిమాని సోనీలివ్ లో స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది.

సినిమా రిలీజ్‌కు చాలా రోజుల ముందే తెలుగు,త‌మిళ హ‌క్కుల‌ను సోని లివ్ సొంతం చేసుకున్న‌ది. అయితే దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. అమల అక్కినేని, రీతూ వర్మ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన వెన్నెల‌కిషోర్‌,ప్రియ‌ద‌ర్శి కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఒకే ఒక జీవితం ఓటీటీ విడుదల పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.

 

Related Articles

తాజా వార్తలు

Movie Articles

GALLERY

BOX OFFICE

GALLERY