అశోక వనంలో అర్జున కళ్యాణం నుంచి సాంగ్ విడుదల.!!

ఫ‌ల‌క్‌నుమాదాస్ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ . విశ్వ‌క్ సేన్ (Vishwak Sen) ప్రస్తుతం అశోక వనంలో అర్జున కళ్యాణం (Ashoka Vanamlo Arjuna Kalyanam) సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ సాంగ్స్ ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్ధం కావా (Oo Aadapilla song) అనే లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam movie songs
Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam movie songs

మాట రాని మాయ‌వా.. మాయ జేయు మాట‌వా.. మాటులోని మ‌ల్లెవా.. అంటూ అర్జున్ (విశ్వ‌క్ సేన్‌) త‌న ప్రేయ‌సి (రుక్స‌ర్ థిల్లాన్‌) కోసం పాట పాడుతున్నారు. అస‌లు వీరి క‌థేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ మేకర్స్. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ చిత్రానికి కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తుండగా విద్యాసాగ‌ర్ చింతా డైరెక్ట్ చేస్తున్నారు. బుధ‌వారం ఈ సినిమా నుంచి ‘ఓ ఆడపిల్ల నువ్వర్ధం కావా..’ అనే పాట‌ను చిత్ర యూనిట్‌ విడుద‌ల చేసింది.

సినిమా ప్రారంభం నుంచి ఈ సినిమాకు డిఫ‌రెంట్‌గా ప్ర‌మోష‌న్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇది వ‌ర‌కు హీరో విశ్వ‌క్ సేన్ పాత్ర అర్జున్ అని, త‌న‌కు ముప్పై ఏళ్లు అవుతున్నా పెళ్లి కావ‌డం లేద‌ని జుట్టు పోతుంద‌ని, పొట్ట వ‌చ్చేస్తుంద‌ని క్యారెక్ట‌ర్‌ను చ‌క్క‌గా రివీల్ చేశారు. అలాగే రీసెంట్‌గా విశ్వ‌క్ సేన్ త‌న‌కు అమ్మాయి దొరికేసిందంటూ సోష‌ల్ మీడియాలో చేసిన పోస్ట్‌కు కూడా మంచి స్పంద‌నే వ‌చ్చింది. ఇప్పుడు విడుద‌ల చేసిన బ్రీజి మెలోడియ‌స్ సాంగ్ ‘ఓ ఆడ‌పిల్లా నువ్వ‌ర్ధం కావా..’ ఆకట్టుకుంటోంది.

జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు. ఆయ‌న సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ పాట‌ను అనంత శ్రీరామ్ రాయ‌గా.. రామ్ మిర్యాల పాడారు. ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మ‌రిన్ని ఆస‌క్తిక‌ర‌మైన అప్‌డేట్స్ అందిస్తామ‌ని చిత్ర యూనిట్ స‌భ్యులు తెలిపారు.

- Advertisement -

 

Related Articles

Telugu Articles

Movie Articles